Director sukumar : ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Director sukumar : ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్…!

Director sukumar : కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. కలర్ ఫోటో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుభాష్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ , అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. అలాగే ఇటీవల యువ నటీనటులతో కలిసి శ్రీరంగనీతులు అనే సినిమాలో కూడా సుహాస్ నటించారు. ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంథాలజీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Director sukumar : ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్...!

Director sukumar : కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. కలర్ ఫోటో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుభాష్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ , అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. అలాగే ఇటీవల యువ నటీనటులతో కలిసి శ్రీరంగనీతులు అనే సినిమాలో కూడా సుహాస్ నటించారు. ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంథాలజీ జోనర్ లో బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకుంది.

Director sukumar : పసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకి…

ఇదిలా ఉండగా త్వరలోనే సుహాస్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డైరెక్టర్ అర్జున్ వీకే దర్శకత్వం వహిస్తున్న ప్రసన్న వదనం అనే సినిమాలో సుహాస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ట్రైలర్ లాంచ్ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల సినీ బృందం నిర్వహించారు . ఇక ఈ కార్యక్రమంలో సినీ నటులతో పాటు పలువురు సెలబ్రిటీల్ సైతం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్న లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ…సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ముఖ్యంగా బన్నీకి విపరీతంగా ఇష్టమని తెలియజేశారు.

పలు సందర్భాల్లో బన్నీ సుహాస్ గురించి మాట్లాడుతూ ఉంటారని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శనీయమని తెలిపారు. అయితే పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ కి మొదట మేము అనుకుంది సుహాస్ నే. కానీ సుహాస్ అప్పటికే సినిమాలో హీరోగా నటిస్తున్నాడని తెలిసింది. తను హీరోగా చేస్తున్నాడు కదా ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కరెక్ట్ కాదనుకొని ఆ క్యారెక్టర్ ను జగదీష్ కు ఇచ్చినట్లుగా సుకుమార్ తెలియజేశారు. అలాగే నాకు న్యాచురల్ స్టార్ నాని అంటే చాలా ఇష్టం ఇప్పుడు నాని గ్రాఫ్ ఎలా అయితే పెరుగుతుందో రాబోయే రోజుల్లో సుహాస్ గ్రాఫ్ కూడా అలాగే పెరుగుతుందని ఈ సందర్భంగా సుకుమార్ తెలియజేశారు. సహజ నటుడు నాని అయితే మట్టి నటుడు సుహాస్ అని అంటే తన నటన అంత ఆర్గానిక్ గా ఉందని తెలిపారు.

Director sukumar ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్

Director sukumar : ప్రసన్న వదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్…!

Director sukumar : టైలర్ విషయానికొస్తే…

ఇది ఇలా ఉండగా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ప్రసన్నవదినం మూవీ ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో సుహాస్ ను సూర్య గా ప్రజెంట్ చేశారు. అతనికి ఉన్న వ్యాధి గురించి చెబుతూ ,దానిలోనే ప్రేమ కథ ఆ తర్వాత మూడు మర్డర్ కేసులో అతను ఏ విధంగా ఇరుక్కున్నాడు అనేది మూవీ మేకర్స్ చూపించారు.అలాగే ఫేస్ బ్లైండ్ నెస్ సమస్యతో బాధపడుతున్న హీరో ఆ సమస్య నుండి ఆ మర్డర్ కేసుల నుండి ఎలా తప్పించుకున్నాడు ,అసలు అంతకులను చట్టానికి ఎలా పట్టించాడు అనేది సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి స్పందన లభిస్తుండగా విడుదల తర్వాత ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది