Director – Heroine : ఛీ..ఛీ.. ఆ హీరోయిన్ కోసం దిగ‌జారిపోయిన డైరెక్ట‌ర్‌.. ఏం చేశాడంటే..?

Authored By mallesh | The Telugu News | Published on: September 18, 2022, 1:30 pm

Director – Heroine : తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల జాబితాలో శర్వానంద్ కూడా ఒకరు. వరుసగా మంచి సినిమాలు చేస్తున్న శర్వానంద్ కెరీర్ లో చాలామంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే తమిళనాడుకు చెందిన ఓ హీరోయిన్ ను తెలుగు సినిమాకు శర్వానంద్ పరిచయం చేయగా.. ప్రస్తుతం ఆ హీరోయిన్ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి.

తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్ పద్మప్రియ. ఈమె మీద ఓ తమిళ డైరెక్టర్ మనసు పారేసుకున్నాడు. హాలీవుడ్ లో చిన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య అనే అతను.. పద్మప్రియతో పరిచయం పెంచుకోవాలని ఆలోచించాడు. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఎంఎస్ ప్రభు అనే వ్యక్తితో పరిచయం కూడా పెంచుకున్నాడు.

director surya warning to prabhu for star heroine

director surya warning to prabhu for star heroine

Director – Heroine : సూర్య అంతలా దిగజారాడా..

ఎంఎస్ ప్రభు ద్వారా ఎలాగైనా పద్మప్రియను దక్కించుకోవాలని సూర్య వేసిన ప్లాన్ ప్రభుకు అర్థమైంది. అయితే దీనిపై పెద్దగా పట్టించుకోని ప్రభు.. సూర్య ఏకంగా బరితెగించి, పద్మప్రియతో తనను పరిచయం చేయకపోతే నీ భార్యను రేప్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న ప్రభు.. పోలీసులను ఆశ్రయించాడు.

దీని మీద కంప్లైంట్ అందుకున్న తమిళనాడు లోని రామాపురం పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో ప్రభు.. తన భార్యను రేప్ చేస్తానని బెదిరించినట్లు కూడా ఉండటంతో పోలీసులు లోతుగా దీనిపై విచారణ చేస్తున్నారు. కాగా ఈ మొత్తం వివాదానికి హీరోయిన్ పద్మప్రియ కారణంగా కాగా.. ఆమె మాత్రం దీనిపై స్పందింకపోవడం గమనార్హం. కాగా పద్మప్రియ తెలుగులో శర్వానంద్ తో పాటు జగపతి బాబు మరియు ఆర్పీ పట్నాయక్ లతో సినిమాలు చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp