Deepthi sunaina shanmukh : దీప్తి, షన్నూలను కలిపేందుకు ఓ దర్శకుడి ప్రయత్నం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi sunaina shanmukh : దీప్తి, షన్నూలను కలిపేందుకు ఓ దర్శకుడి ప్రయత్నం..!

 Authored By himanshi | The Telugu News | Updated on :3 January 2022,11:00 am

Deepthi sunaina shanmukh : యూట్యూబ్‌ స్టార్స్ దీప్తి సునైన మరియు షన్నూల బ్రేకప్‌ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. సోషల్‌ మీడియాలో వీరు విడి పోవడం గురించి కొన్ని కోట్ల పోస్ట్‌ లు పడుతున్నారు. కొందరు వీరు విడి పోవడం మంచిది అయ్యింది అంటూ ఉంటే మరి కొందరు మాత్రం వీరిద్దరు విడి పోవడంను జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక మంచి జంట చిన్న పాటి విభేదాలతో విడి పోవడం దారుణం.. ఇద్దరి జంట కూడా ఒక అద్బుతం అన్నట్లుగా ఉండేది.. వీరిద్దరి జంటను అలా స్క్రీన్‌ మీద చూసుకుంటే మమ్ములను చూసుకున్నట్లుగా ఉండేది అంటూ ఎంతో మంది యూత్‌ అనుకునేవారు.అలాంటి జంట విడి పోవడం తో తెలుగు రాష్ట్రాల్లోని యువత చాలా బాధ పడుతున్నారు.

వారి వ్యక్తిగత జీవితం వారిది అన్నట్లుగా ఆలోచించకుండా వారు మళ్లీ కలిస్తే బాగుండు అంటూ ఏకంగా దేవుడిని కూడా ప్రార్థిస్తున్నారు. వీరిద్దరు కలిసి చేసిన వెబ్‌ సిరీస్ లు కవర్‌ సాంగ్స్ ను కూడా ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌ చేస్తూ.. వీరిద్దరి మద్య ఉన్న లవ్‌ కమ్ రొమాంటిక్ సన్నివేశాలను షేర్ చేస్తూ వారికే వారి ప్రేమను మళ్లీ గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీప్తి సునైన క్లీయర్ గా షన్నూ తో విడి పోతున్నాను.ఇక నా వల్ల కాదు అన్నట్లుగా తేల్చి చెప్పింది. షన్నూ కూడా ఆమె నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉంది. కనుక ఈ విషయం లో నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఆమె సంతోషంగా ఉండాలని ఆశిస్తాను అంటూ బ్రేకప్ ను అంగీకరించాడు.

Deepthi sunaina shanmukh :  ప్లీజ్ దీపు ఈసారికి షన్నూను క్షమించు

ఈ సమయంలో ఒక దర్శకుడు వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీప్తి సునైన మరియు షన్నూ లకు కామన్ ఫ్రెండ్‌ మరియు వారిద్దరితో కలిసి పలు ప్రాజెక్ట్‌ లకు వర్క్ చేసిన ఒక దర్శకుడు వారిద్దరితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒక వేళ దీప్తి సైడ్ నుండి ఓకే అయితే షన్నూ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అతడు మళ్లీ కూడా అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఖచ్చితంగా దీప్తి తో మాట్లాడుతాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

director trying to Deepthi sunaina and shanmukh new love

director trying to Deepthi sunaina and shanmukh new love

దాంతో ఆ దర్శకుడి ప్రయత్నం కనుక ఫలిస్తే అభిమానులు అంతా కూడా ఫుల్‌ హ్యాపీ. ఈ ఒక్కసారికి మా షన్నూ బాబుకు అవకాశం ఇవ్వవచ్చు కదా దీప్తి అంటూ అభిమానులు రిక్వెస్ట్‌ చేస్తున్నారు. దీప్తి సునైన మరియు షన్నూ లు మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్న వారి సన్నిహితులు మరియు స్నేహితులు కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సమస్య వారి వారి కుటుంబ సభ్యుల నుండి అయితే మాత్రం కలవడం కష్టం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కలిస్తే వీరు రాబోయే రెండు మూడు నెలల్లోనే.. మరీ ఆలస్యం అయితే వీరు ఇద్దరు మళ్లీ కలిసే అవకాశాలే లేవు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది