Chiranjeevi : చిరంజీవిపై గుర్రుగా ఉన్న డైరెక్టర్స్.. కారణం ఏంటి?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా బిడ్డగా ఉంటూ ఆపదల సమయంలో అండగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు హర్షించ దగినవి. ఎప్పుడు వివాదాల జోలికి వెళ్లని చిరంజీవి ఇటీవల మాత్రం ఒక్కోసారి తన మాటల వలన విమర్శల పాలవుతున్నాడు. ఇటీవల అమీర్ ఖాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఇన్‌డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.దీంతో చిరంజీవిపైనే కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటాడు. ఎప్పుడు సౌమ్యంగా ఉండే ఆయన ఇటీవల పంథా మార్చుకున్నట్టు కనిపిస్తుంది. దీనికికారణం చిరంజీవి ‘లాల్ సింగ్ చద్దా’ ప్రమోషన్ ఫంక్షన్ లో అమీర్ ఖాన్ తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో చిరంజీవి చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరిచాయి…
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులు ఏరోజుకారోజు హీరోలకు ఎదురుగా కూర్చుని డైలాగ్స్ అప్పటికప్పుడు వ్రాసి ఇస్తూ ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని కామెంట్స్ చేసాడు. అంతేకాదు తనలాంటి సీనియర్ హీరోకు కూడ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని దీనివల్ల నటిస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించి హీరోలు తమ డైలాగ్స్ ను సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటు దర్శకులను టార్గెట్ చేస్తూ చిరంజీవి కామెంట్ చేయడంతో మెగా స్టార్ ఎవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసాడు అంటూ అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవిపై విమర్శల దాడి మొదలైంది. నిజానిజాలు తెలుసుకోకుండా యాంటీ ఫ్యాన్స్ చిరంజీవిని ఏకిపారేశారు. ఆచార్య విషయంలో కొరటాలను ముంచేశారని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలు చిరంజీవి-కొరటాల మధ్య దూరం పెంచాయని తాజా ఘటనతో అర్థమవుతుంది. ఆచార్య మూవీతో కొరటాల ఆర్ధికంగా నష్టపోయారు.
పైగా చిరంజీవి ఇలాంటి కామెంట్స్ తో ఆచార్య ఫెయిల్యూర్ పూర్తిగా కొరటాల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో చిరంజీవి కామెంట్స్ చర్చకు దారితీయగా, కొరటాల అభిమానులు ఆయనకు కౌంటర్లు ఇస్తున్నారు. అనవసరంగా చిరంజీవి సమసిపోయిన వివాదాన్ని తన కామెంట్స్ తో తట్టిలేపినట్లు అయ్యింది. నెక్స్ట్ కొరటాల ఎన్టీఆర్ తో మూవీ చేస్తుండగా బ్లాక్ బస్టర్ కొట్టి తానేమిటో మెగాస్టార్ కి తెలియజేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సీనియర్ హీరోలు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లు ఈతరం దర్శకులతో కూడ సద్దుకుపోతుంటే చిరంజీవికి ఇలాంటి అసహనం నేటితరం దర్శకుల పై ఎందుకు ఏర్పడింది అన్నవిషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది..మరి ఈ వివాదంపై చిరంజీవి ఏమైన స్పందిస్తాడా అన్నది చూడాలి. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కావడం వెనక ఎంతో కృషి, పట్టుదల,దీక్ష ఉన్నాయి.
అంతేకాదు తన సినిమాలతో టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. తన జనరేషన్‌లో ఈ రికార్డు ఒక్క చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది.. ప్రాణం ఖరీదు సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత మెల్ల మెల్లగా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఖైదీ మూవీతో మాస్ హీరోగా ఎదిగి నెంబర్ వన్ హీరో అయ్యారు. ఇక తన జనరేషన్ హీరోల్లో చిరంజీవికి మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది. ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద దెబ్బే తగిలింది. చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య చిత్రం అత్యంత ఘోర పరాజయంగా నిలిచిపోయింది. దీని నుంచి బయట పడి ఫ్యాన్స్ కి ఎలాగైనా ఒక సూపర్ హిట్ ఇవ్వాలని చిరు భావిస్తున్నారు. ఇక నుంచి అభిమానులు కోరుకునే సినిమాలే చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్న చిత్రం ‘మెగా 154. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇంకా ఫిక్స్ కాలేదు.