Brahmanandam : బాబోయ్ క‌మెడీయ‌న్‌గా ఉంటూనే కోట్లు కూడ‌బెట్టిన బ్ర‌హ్మానందం.. ఆస్తుల చిట్టా చెబితే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmanandam : బాబోయ్ క‌మెడీయ‌న్‌గా ఉంటూనే కోట్లు కూడ‌బెట్టిన బ్ర‌హ్మానందం.. ఆస్తుల చిట్టా చెబితే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 February 2022,7:00 pm

Brahmanandam: తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో లెజండ‌రీ క‌మెడీయ‌న్ బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న త‌న హాస్యంతో ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ఆయ‌న కామెడీకి మైమ‌రచిపోని వారు లేరు. ఇప్ప‌టికీ సినిమాల‌లో న‌టిస్తూ అల‌రిస్తున్నారు బ్ర‌హ్మానందం. హాస్యబ్రహ్మ’ బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో దర్శకత్వంలో ‘రంగమార్తాండ’లో ఇంపార్టెంట్ రోల్ చే’స్తున్నారు. ఈ యేడాది ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈయన కెరీర్‌లో చేయని పాత్ర ఇది. మరోవైపు పంచతంత్రం సినిమాలో కూడా వేద వ్యాస్ అంటూ మరో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు బ్రహ్మానందం.బ్రహ్మానందం… ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేసింది. తెర మీద ఆయన కనిపిస్తే చాలు, థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. హార్ట్ ఆపరేషన్ అయినప్పటి నుంచి బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈయన చివరగా ‘జాతి రత్నాలు’ సినిమాలో జడ్జ్ పాత్రలో కనిపించారు.

ఈయన మొత్తంగా 1250 పైగా సినిమాల్లో నటించారు.బ్రహ్మానందంలో మంచి నటుడే కాదు.. ఆయనలో ఓ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇక కరోనా కారణంగా ఏర్పడిన ఖాళీని తన పెయింటింగ్స్‌తో తీర్చుకుంటున్నారు. ఆయన వేసిన పెయింట్స్ పలువురు హీరోలకు కానుకగా ఇచ్చారు.మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా బ్రహ్మానందం ఒక్కో కాల్టీటుకు రూ. లక్ష చార్జ్ చేస్తున్నారు. ఒక్కొసారి ఒక సినిమాకే ఈయన రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటారు.అప్ప‌ట్లో బ్ర‌హ్మానందం లేని సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇలా కోట్లు సంపాదించిన బ్రహ్మానందం తన పారితోషకంలో సగాన్ని భూములపై ఇన్వెస్ట్ చేశారు. దాంతో పాటు ఎపుడు పొదుపరిగా ఉండేవారు. ఇక ఆయన స్థిర, చరాస్థులు అన్ని కలిపితే.. దాదాపు రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దుర‌ల‌వాట్లు కూడా ఆయ‌నకు పెద్ద‌గా ఏమి లేక‌పోవ‌డంతో బాగానే కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది.

do you know facts about brahmanandam assests

do you know facts about brahmanandam assests

Brahmanandam : బ్ర‌హ్మానందం ఆస్తుల చిట్టా వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే..

బ్ర‌హ్మానందం కెరీర్‌లో కొన్ని కీల‌క పాత్ర‌లు ఎప్ప‌టికీ అలా గుర్తుండి పోతాయి. అహానా పెళ్లంటలో అర‌గుండు పాత్ర.. ఆ తర్వాత ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్‌గా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీలో మెక్‌డోల్డ్ మూర్తి, వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అదుర్స్‌లో భ‌ట్టు పాత్ర, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో గ‌చ్చిబౌలి దివాక‌ర్, బాద్ షాలో జ‌య‌సూర్య ఇలా బ్రహ్మీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రంలో కిల్ బిల్ పాండే, రవితేజ, వినాయక్ కృష్ణ సినిమాలో బాబీ ఇలా చాలా ఉన్నాయి. బ్రహ్మానందం ఏ నటుడికీ సాధ్యం కాని ఘనతను, గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రహ్మానందంపై ఏకంగా శతకాన్ని రచించారు. ఒక నటుడిపై 108 పద్యాలతో శతకాన్ని రచించడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. హెచ్.ఆర్ చంద్రం బ్రహ్మానంద శతకాన్ని రచించి పబ్లిష్ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది