Sreeja Konidela : ఇటీవల కాలంలో సెలబ్రిటీల డైవోర్స్ లు పెరిగిన సంగతి అందరికీ విదితమే. రీసెంట్ గా ధనుష్-ఐశ్వర్య డైవోర్స్ తీసుకోబోతున్నట్లు తెలిపారు. కాగా, టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ జంట డైవోర్స్ తీసుకోబోతున్నదని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆ జంట ఎవరంటే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్.శ్రీజ-కల్యాణ్ దేవ్ విడిపోతున్నారని వార్తలు రావడానికి ప్రధాన కారణం ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో .. శ్రీజ తన పేరును మార్చడమే. అంతకు ముందు శ్రీజ కల్యాణ్ గా ఉన్న పేరును శ్రీజ కొణిదెల గా మార్చుకుంది.
దాంతో వీరు త్వరలో డైవోర్స్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. దానికి తోడు తాజాగా శ్రీజ తన భర్త కల్యాణ్ దేవ్ తో కాకుండా అన్నయ్య రామ్ చరణ్ తో ముంబైకి హాలీ డే ట్రిప్ కు వెళ్లింది. అది చూసి నెటిజన్లు కల్యాణ్ దేవ్ తో శ్రీజ డైవోర్స్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.ఈ క్రమంలోనే హాలీడే ట్రిప్ కు సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ తాను బతికి ఉండటానికి గల సంతోష కారణాలివే అంటూ క్యాప్షన్ పెట్టింది. అలా శ్రీజ భావోద్వేగ పోస్టు పెట్టడం వెనుక విడాకుల నిర్ణయం ఉండి ఉంటుందా? అని ఈ నేపథ్యంలో నెటిజన్లు కొందరు అనుమానిస్తున్నారు.
అయితే, శ్రీజ-కల్యాణ్ దేవ్ డైవోర్స్ గురించి అటు కల్యాణ్ దేవ్ కాని ఇటు శ్రీజ కాని మెగా ఫ్యామిలీ మెంబర్స్ కాని ఎవరూ స్పందించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. చూడాలి మరి… ఈ ఊహాగానాలకు తెర ఎప్పుడు పడుతుందో.. ఇకపోతే రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదల కానుంది. తండ్రీ తనయులు చిరు, చెర్రీలు కలిసి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.