Raghavendra Rao : రాఘవేంద్రరావు పేరు చివర ఉండే బీఏకు ఎంత సెంటిమెంట్ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raghavendra Rao : రాఘవేంద్రరావు పేరు చివర ఉండే బీఏకు ఎంత సెంటిమెంట్ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Raghavendra Rao : తెలుగు సినిమా ప్రేక్షకులకు డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాడు ఆయన. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు చరిత్రను సృష్టించాయి. ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం. ఆయన తీసే సినిమాలో నటించేందుకు నటీనటులు పోటీ పడేవారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన దర్శకత్వానికి ఎంత డిమాండ్ ఉంటుందో.గత ఆరు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ఆయన్ను ఢీకొట్టే దర్శకుడు రాలేదంటే.. ఆయన […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 December 2021,7:00 pm

Raghavendra Rao : తెలుగు సినిమా ప్రేక్షకులకు డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాడు ఆయన. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు చరిత్రను సృష్టించాయి. ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం. ఆయన తీసే సినిమాలో నటించేందుకు నటీనటులు పోటీ పడేవారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన దర్శకత్వానికి ఎంత డిమాండ్ ఉంటుందో.గత ఆరు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ఆయన్ను ఢీకొట్టే దర్శకుడు రాలేదంటే.. ఆయన ప్రతిభ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్టయిలే వేరు. అప్పట్లో ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి.. నేడు.. కుర్ర హీరోలతో సినిమాలు తీసి కూడా అంతే స్థాయి విజయాన్ని అందుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు ప్రస్తుతం కొనసాగుతున్న చాలామంది డైరెక్టర్లు.. రాఘవేంద్రరావు శిష్యులే. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా రాఘవేంద్రరావు శిష్యుడే. అయితే.. రాఘవేంద్రరావు సినిమాల్లో ఆయన పేరు వెనుక ఉండే బీఏ అనే పదాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా?ఆయన ప్రతి సినిమా టైటిల్ లో ఆ పేరు చివర్లో ఖచ్చితంగా ఉంటుంది. అదేదో.. ఆయన బీఏ చదివాడు కాబట్టి.. అందుకోసం.. బీఏ అని రాయించుకున్నాడు అని అనుకుంటున్నారేమో. కాదు.. దాని వెనుక పెద్ద చరిత్రే ఉంది.నిజానికి రాఘవేంద్రరావు చదివింది బీఏనే. కానీ.. ఒకవేళ ఆయన డైరెక్టర్ కాకపోయి ఉంటే.. ఏ డ్రైవరో..

do you know the sentiment of ba in raghavendra rao name

do you know the sentiment of ba in raghavendra rao name

Raghavendra Rao : ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా రాఘవేంద్రరావు శిష్యుడే

లేక వేరే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేవాడినని చాలా సందర్భాల్లో చెప్పారు.రాఘవేంద్రరావు.. కెరీర్ తొలినాళ్లలో.. డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయట. ఆ సినిమాలకు చివర బీఏ అని చేర్చాడట ఆయన. ఆ తర్వాత ఒక సినిమాకు ఎందుకో బీఏ అని పేరు పెట్టుకోలేదట. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందట.ఆ తర్వాత సినిమాకు మళ్లీ బీఏ అని పెట్టాడట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందట. అప్పటి నుంచి ఇక.. తన సినిమాలన్నింటికీ బీఏ అని ఖచ్చితంగా పెడుతున్నాడట రాఘవేంద్రరావు. అదే లెగసీ ఇప్పటికీ కొనసాగుతోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది