Mirrors in lift : లిఫ్టులో అద్దాలు ఎందుకు పెడతారో తెలుసా మీకు..?
Mirrors in lift : చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువ దూరం నడువడానికి ఇష్టపడటం లేదు. కానీ తమ బరువును తగ్గించుకోవడానికి మాత్రం జిమ్ సెంటర్లకు వెళ్తుంటారు. అదే మెట్లు ఎక్కడం, దిగడం.. ఎక్కువ దూరం నడిస్తే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పోతే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న టైంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మానేసి కేలరీలు కరగకుండా ఉండేందుకు లిఫ్టులు ఎక్కేందుకు జనాలు ఇష్టపడుతున్నారు.అయితే లిప్టులో ఎక్కేటప్పుడు చాలా మంది అందులోని అద్దాలను గమనించే ఉంటారు. అద్దాలు మన మొహం చూసుకోవడానికి మాత్రం అస్సలు కాదట.. కొందరైతే అది మరిచి హెయిర్ స్టైల్ చూసుకోవడం చేస్తుంటారు.
అసలు మిర్రర్ పెట్టిందే అందులో ఎక్కువారి కోసం అని తెగ ఫీల్ అయిపోతుంటారు.అసలు లిఫ్టులో అద్దాలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..లిఫ్టులో అద్దాలు పెట్టడానికి ప్రధాన కారణం సేఫ్టీ కోసం..లిఫ్టులో ఉన్నపుడు మనతో పాటు చాలామంది ఎక్కుతారు.మనం మిర్రర్ వైపు చూస్తూ అందరిని గమనించవచ్చు.గుంపులో ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నా లేక మరేదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న తేలికగా గుర్తించవచ్చు. లిఫ్ట్ లలో అద్దాలను మొదటిసారి జపాన్ దేశం ప్రవేశపెట్టిందట.. వికలాంగులకు,వీల్ చైర్ వినియోగదారులకు మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందికరం.
అలాంటి వారికి లిఫ్టులు సౌలభ్యంగా ఉంటాయి. కానీ వీరు వీల్ చైర్ లో కూర్చుని వెనక్కి తిప్పడం కొంత కష్టతరంగా ఉంటుంది. ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.అదే మిర్రర్ ఉంటే వెనుక నుంచునే వ్యక్తి సేఫ్‌గా వీల్ చైర్‌ను తిప్పడం సాధ్యమవుతుందని ఆలోచన చేశారట.. లిఫ్టులో ఇరుకున్న ఉన్న టైంలో గాలి ఆడదు.దీంతో చాలా మంది క్లాస్ట్రోఫోబియా సమస్యతో బాధపడుతుంటారని తెలుస్తోంది.అది వారిలో ఒత్తిడి ని పెంచుతుంది. ఫలితంగా వారి గుండె చప్పుడు వేగం పెరిగి అరచేతిలో చెమటలు పడుతుంటాయి.అదే లిఫ్ట్లో అద్దం ఉండటం వలన ఈ ఆందోళనలను తగ్గి కొంతమేర వాళ్లు మెల్లిగా ఊపిరి తీసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుందట..