Samantha : సమంతకు ఆ పిచ్చి ఎక్కువట.. అందుకే ఆ పనులు చేస్తుందట

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 7 January 2023, 12:20 pm

Samantha : సమంత రుతుప్రభు కాస్త సమంత అక్కినేని అయింది. ఆ తర్వాత మళ్లీ సమంత రుతుప్రభుగా మారిపోయింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు అయితే లభించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు శాసించింది. కానీ.. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం మాత్రం తనను, తన కెరీర్ ను చాలా డిస్టర్బ్ చేశాయి. పెళ్లి ఆ తర్వాత విడాకులు, ఇప్పుడు తనకు వచ్చిన మాయదారి రోగం.. ఇలా తనను ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేసేసింది. అయినా కూడా తను ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తన సత్తా చాటుతోంది.

ఇటీవల తను యశోద అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే నడిచింది. ఆ సినిమా తర్వాతనే తనకు మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి సోకిందని తెలిసింది. తన వ్యాధి గురించి కూడా అందరికీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వ్యాధికి సంబంధించిన చికిత్సను చేయించుకుంటోంది సమంత. సమంత నటించిన శాకుంతలం అనే సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో మళ్లీ సమంత పబ్లిక్ లోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి.

does samantha have publicity craze alwasy for her movies

does samantha have publicity craze alwasy for her movies

Samantha : త్వరలో సమంత శాకుంతలం సినిమా రిలీజ్

అయితే.. యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలోనే తనకు అరుదైన వ్యాధి ఉందంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆ తర్వాత సరిగ్గా శాకుంతలం అనే సినిమా రిలీజ్ టైమ్ కు మళ్లీ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలోకి వచ్చిందంటున్నారు. తనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని.. దాని కోసం ఏదైనా చేస్తుందని సమంత మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చూద్దాం మరి.. నిజంగానే సమంతకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందా? లేక.. తను కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే సోషల్ మీడియాలోకి వస్తుందో తెలుసుకుందాం.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp