Koratala Siva – Acharya : మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఈ సినిమాలన్నీ దర్శకుడిగా పూర్తిగా కొరటాల శివ మార్క్‌ను చాలా క్లియర్ గా చూపిస్తాయి. కానీ, తాజాగా వచ్చిన ఆచార్యలో ఆ ఛాయలు అసలు వెతుక్కున్నా కనిపించడం లేదు. మెగా అభిమానులు ఎంతో ఆతృతగా నాలుగేళ్ళ నుంచి ఎదురుచూస్తే నిమిషాలలో అదంతా ఆవిరైపోయింది. కథ ఫైనల్ చేయడంలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని అందరూ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కానీ, చిరు కూడా ఇలాంటి 80, 90ల నాటి పేలవమైన కథతో ఆచార్య సినిమా చేస్తారని అనుకోలేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి మెగాస్టార్ నుంచి వస్తుందనీ అది కూడా మెగా మల్టీస్టారర్‌గా వచ్చి ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందనీ ఎవరూ ఊహించలేదు.
కొరటాల శివ మార్క్ సినిమా అంటే నమ్మే జనాలు లేకపోవడం ఇక్కడ ఆసక్తి కరమైన విషయం. కథాంశమే సరిగ్గా లేకపోవడం ఆచార్య సినిమాకు పెద్ద మైనస్ అయింది. కొరటాల గత చిత్రాలు నాలుగు నాలుగు డిఫరెంట్ జోనర్‌లో వచ్చాయి. ఇప్పుడు ఆచార్య కూడా వాటికి భిన్నంగా వచ్చిన సినిమానే. కానీ, అది పాత కథ. ఇప్పటికే ఈ తరహా ట్రీట్‌మెంట్‌తో సౌత్ భాషలలో చాలా సినిమాలొచ్చాయి. ఆచార్య సినిమా ఫ్లాప్‌కు కారణం, పూర్తి బాధ్యత దర్శకుడు కొరటాల శివదే అని అంటున్నారు. వాస్తవంగా చూస్తే అంతే. ఇద్దరు మెగా హీరోలు దొరికితే ఎలాంటి మల్టీస్టారర్ రావాలి. కానీ, ఇది చూస్తే థియేటర్స్ సినిమాకు ఎక్కువ, ఓటీటీకి తక్కువగా అనిపిస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా ప్రభావం కొరటాల మీద గట్టిగా పడింది. తర్వాత చేస్తున్న ఎన్.టి.ఆర్ 30 మీద నందమూరి అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యా యట. తారక్‌కు అభిమానులు కొరటాల చెప్పిన కథ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించమని సలహాలిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇక చరణ్‌తో ఇప్పటికే ఓ సినిమా చేస్తానని కొరటాల అన్నాడు. అలాగే, అల్లు అర్జున్‌తో, పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధంగా ఉందని చెప్పాడు. అవన్నీ పునారాలోచిస్తున్నారు. ఎన్.టి.ఆర్ 30 తప్ప ..పవన్, చరణ్, అల్లు అర్జున్ సినిమాలు ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవంటున్నారు. చూడాలి మరి ఎన్.టి.ఆర్ 30 కొరటాల శివ కెరీర్‌ను ఎలా డిసైడ్ చేస్తుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.