Rajasekhar : మోహన్ బాబుతో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వదులుకోవడానికి గల కారణమదే.. రాజశేఖర్ సంచలన కామెంట్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rajasekhar : మోహన్ బాబుతో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వదులుకోవడానికి గల కారణమదే.. రాజశేఖర్ సంచలన కామెంట్స్..

Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగానే ఉన్నారు. ఆయన భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్..సెంటిమెంటల్, ఎమోషనల్ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ‘ఆలీతో జాలీగా’ షోలో తాను ఓ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వదులుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఆ సినిమా ఏదంటే..? ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 January 2022,4:40 pm

Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగానే ఉన్నారు. ఆయన భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ‘శేఖర్’ సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్..సెంటిమెంటల్, ఎమోషనల్ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ‘ఆలీతో జాలీగా’ షోలో తాను ఓ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వదులుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఆ సినిమా ఏదంటే..? ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ‘పీఎస్ వీ గరుడ వేగ’ ఫిల్మ్‌తో డాక్టర్ రాజశేఖర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ సినిమా ఆడియన్స్ ను మెప్పించగలిగింది.

ఇక ప్రస్తుతం ‘శేఖర్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు రాజశేఖర్. తాజాగా ‘ఆలీతో జాలీగా’ షోలో తన భార్య జీవితతో కలిసి రాజశేఖర్ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘హనుమాన్ జంక్షన్’ వదులుకోవడానికి గల కారణాలను తెలిపాడు.ఈ చిత్రాన్ని ఎడిటర్ మోహన్ తన కుమారుడు ఎం.రాజా దర్శకత్వంలో ‘హనుమాన్ జంక్షన్’ పేరుతో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో ఇద్దరు హీరోలు కాగా, రాజశేఖర్‌తో పాటు మోహన్ బాబు కూడా హీరో అని రాజశేఖర్‌కు తర్వాత చెప్పారట. ఈ క్రమంలోనే రాజశేఖర్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే, తానే ఈ సినిమా వద్దనుకున్నానని రాజశేఖర్ తెలిపాడు.

rajasekhar told the reason behind rejecting the block buster film with mohanbabu

rajasekhar told the reason behind rejecting the block buster film with mohanbabu

Rajasekhar : అడ్వాన్స్ తీసుకున్నాక.. నో చెప్పిన రాజశేఖర్..

అందుకు గల కారణమేమంటే.. మోహన్ బాబు సినిమా షూటింగ్‌కు పొద్దున్నే 7 గంటలకు మేకప్‌తో సహా వచ్చేసి కూర్చుంటాడని, తాను మాత్రం 10 గంటల తర్వాతే షూటింగ్‌కు వస్తానని చెప్పాడు. అలా షూటింగ్ టైంలో తనకు, మోహన్ బాబు క్లాష్ అయి ఉన్న రిలేషన్ దెబ్బతింటుందనే భయంతోనే సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పాడు రాజశేఖర్. కాగా, తర్వాత ఆ సినిమా.. అర్జున్, జగతిబాబు వద్దకు వెళ్లింది. వారు ఆ ఫిల్మ్‌లో నటించగా, సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది