నవ్వించే ఇతడి వెనుకు ఇంతటి టాలెంట్ ఉందా?.. టచ్ చేసిన ఇమాన్యుయేల్
మనకు తెరపై కనిపించిన దాన్నే నమ్ముతాం. ఎక్కువగా విలన్ పాత్రలే చేస్తే అతను నిజంగానే విలన్ అని అనుకుంటాం. తెరపై ఎప్పుడూ కామెడీ చేస్తూ ఉంటే నిజంగానూ కామెడీగానే ఉంటాడని అందరూ భావిస్తుంటారు. కానీ అది నిజంగా కాదు. తెరపై వారు చేసేది కేవలం నటనే. వారి రియల్‌గా చాలా టాలెంట్ ఉండొచ్చు. ఎవ్వరికీ తెలియన ప్రతిభ ఉంటుంది. తాజాగా ఇమాన్యుయేల్ విషయంలోనూ అదే జరిగింది. ఇమాన్యుయేల్ తాజాగా సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా విచ్చేశాడు. మామూలుగా […]
మనకు తెరపై కనిపించిన దాన్నే నమ్ముతాం. ఎక్కువగా విలన్ పాత్రలే చేస్తే అతను నిజంగానే విలన్ అని అనుకుంటాం. తెరపై ఎప్పుడూ కామెడీ చేస్తూ ఉంటే నిజంగానూ కామెడీగానే ఉంటాడని అందరూ భావిస్తుంటారు. కానీ అది నిజంగా కాదు. తెరపై వారు చేసేది కేవలం నటనే. వారి రియల్‌గా చాలా టాలెంట్ ఉండొచ్చు. ఎవ్వరికీ తెలియన ప్రతిభ ఉంటుంది. తాజాగా ఇమాన్యుయేల్ విషయంలోనూ అదే జరిగింది. ఇమాన్యుయేల్ తాజాగా సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా విచ్చేశాడు.
మామూలుగా ఇమాన్యుయేల్ అంటే కామెడీ చేస్తాడని అందరూ అనుకుంటారు. వర్షతో కలిసి ఏదో కుళ్లు జోకులు, పులిహెర కలపడం, ట్రాకులు వేస్తూ స్టేజ్ మీద నవ్విస్తాడని అందరూ భావిస్తుంటారు. నిజానికి జబర్దస్త్ స్టేజ్ మీద ఇమాన్యుయేల్ చేసేది కూడా అదే. కానీ ఇమాన్యుయేల్‌లో ఓ అద్భుతమైన టాలెంట్ ఉంది. అది సుమ క్యాష్ షోలో బయట పడింది. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో జబర్దస్త్ జంటలు పాల్గొన్నాయి.
అందులో భాగంగానే వర్ష ఇమాన్యుయేల్ కలిసి వచ్చారు. అయితే ఇందులో ఇమాన్యుయేల్ మొదట్లో కామెడీ చేసినా కూడా చివరకు మాత్రం అందరినీ ఏడిపించేశాడు. రాజవేఖర్ సినిమా సింహారాశిలో ఓ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. అమ్మ ప్రేమను చాటి చెప్పే పాట అందరికీ తెలిసిందే. అమ్మా అని పిలిపి పిలిచి గుండె పిండకు రా అని ఏడుపు తెప్పించే పాట ఒకటి ఉంటుంది. ఆ పాటను అదే వాయిస్‌లో అదే ఎమోషనల్‌గా ఇమాన్యుయేల్ పాడేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే అందర్నీ ఇమాన్యుయేల్ టచ్ చేశాడు.