Rashmi Gautam : నీ బండారం బ‌య‌టపెడ‌తానంటూ ర‌ష్మీకి అలా వార్నింగ్ ఇచ్చాడేంటి.. టెన్ష‌న్‌లో యాంక‌ర‌మ్మ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : నీ బండారం బ‌య‌టపెడ‌తానంటూ ర‌ష్మీకి అలా వార్నింగ్ ఇచ్చాడేంటి.. టెన్ష‌న్‌లో యాంక‌ర‌మ్మ‌

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Rashmi Gautam : నీ బండారం బ‌య‌టపెడ‌తానంటూ ర‌ష్మీకి అలా వార్నింగ్ ఇచ్చాడేంటి.. టెన్ష‌న్‌లో యాంక‌ర‌మ్మ‌

Rashmi Gautam : యాంక‌ర్ ర‌ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ETV jabardasth show మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మీ స్టార్ యాంక‌ర్‌గా  Anchor Rashmi Gautam ఎదిగింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు ఓ వైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ర‌ష్మీ గ‌త కొంత కాలంగా సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతుందని వార్త‌లు వ‌స్తున్నా కూడా దానిపై క్లారిటీ రావ‌డం లేదు. అయితే తాజాగా ర‌ష్మీని క‌మెడీయన్ నీ బండారం బ‌య‌ట‌పెడ‌తానంటూ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల‌లోకి వెళితే ర‌ష్మీ హోస్ట్‌గా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. ఇంద్రజ. కృష్ణ‌ భగవాన్ జడ్జిలుగా వ్యవహారిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈవారం కూడా తమ కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు జబ‌ర్థ‌స్త్ టీమ్స్. వ‌ర్ష‌- ఇమ్మాన్యుయేల్ వెరైటీ కాన్సెప్ట్‌తో సంద‌డి చేశారు. స్కిట్ లో న అనుమానపు మొగుడు పాత్ర ఇమ్మాన్యుయేల్ చేయ‌గా, ఆయ‌న భార్య‌గా వ‌ర్ష చేసింది. అయితే వ‌ర్ష‌తో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ… రాత్రి నిద్ర లేచి చూస్తే నువ్వు పక్కలో లేవేంటే… అని వర్షను ఉద్దేశించి అన‌గా, అప్పుడు నేను వాష్ రూమ్ కి వెళ్ళానండి అని వర్ష అంటుంది.అప్పుడు ఇమ్మూ.. నీ మీద అనుమానంతో నీ చేతికి ట్రాకర్ పెట్టానే.. ఇంట్లో ఉన్న వాష్ రూమ్ కి ఐదు అడుగులు. పోవ‌డానికి ఐదు అడుగులు, రాను ఐదు అడుగులు.. మిగతా ఐదు అడుగులు ఎక్కడికి పోయావే అని నిల‌దీయ‌డంతో వ‌ర్ష మైండ్ బ్లాక్ అవుతుంది.

Rashmi Gautam

Rashmi Gautam

ఇక అప్పుడు ర‌ష్మీ క‌లిగించుకొని క‌ట్టుకున్న భార్య‌తో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. రష్మీ మాటలకు సమాధానంగా… ఎక్కువ మాట్లాడితే నీ అడుగులు కూడా లెక్క పెట్టేస్తా ..నాతో పెట్టుకుంటే నీ బండారం కూడా బయటపెట్టేస్తా… అని ఇమ్మానియేల్ emanuel వార్నింగ్ ఇవ్వ‌డంతో ర‌ష్మీ కూడా షాక్ అయి సైలెంట్ అవుతుంది. ఇక ఈ రోజు ప్ర‌సారం కానున్న స్కిట్‌లో వెంటనే మార్చేయడానికి అది బాయ్ ఫ్రెండ్ కాదు బల్బ్​అంటూ బుల్లెట్ భాస్కర్ Bullet Bhaskar చేసిన స్కిట్ కూడా తెగ న‌వ్విస్తుంది. అలానే రోహిణి కూడా త‌న మార్క్ కామెడీతో అల‌రించ‌నుంది. ఆటో రామ్ ప్ర‌సాద్ స్కిట్ కూడా క‌డుపుబ్బ న‌వ్విస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది