Hyper Aadi : హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లను జబర్దస్త్ నుండి మల్లెమాల వారు కావాలని తప్పించారా?
Hyper Aadi : ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ప్రసారం అవ్వబట్టి దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది. ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు అద్బుతమైన రేటింగ్ తో టాప్ రేటెడ్ షో గా నిలిచింది. కాని గత ఏడాది రెండేళ్ల నుండి జబర్దస్త్ రేటింగ్ తగ్గడం మొదలు అయ్యింది. గతంలో వచ్చిన రేటింగ్ తో షో ను గంటన్నర.. రెండు గంటల పాటు టీవీలో టెలికాస్ట్ చేసే వారు. కాని రేటింగ్ తగ్గడంతో చాలా సమయం కుదించారు.ఇప్పుడు యాడ్స్ తొలగించగా కనీసం 40 నిమిషాల స్కిట్స్ కూడా ఉండటం లేదు. అంతటి దారుణమైన పరిస్థితి ఉండటంతో యాడ్స్ కూడా చాలా వరకు తగ్గాయి.
ఆదాయం భారీగా తగ్గడం వల్ల ఖర్చును కూడా చాలా వరకు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో మల్లెమాల వారు కాస్ట్ కట్టింగ్ పేరుతో కొందరిని తొలగించడం.. కొందరితో ఒప్పందాలు రద్దు చేసుకుని పారితోషికం తగ్గించడం వంటివి చేశారట.గత రెండు మూడు నెలలుగా హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఆయన జబర్దస్త్ కు దూరం అయ్యాడని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆది జబర్దస్త్ కు దూరం అయ్యాడు కాని ఇతర షో ల్లో కంటిన్యూ అవుతున్నాడు. అలా ఎలా సాధ్యం అనుకుంటూ ఉండగా అసలు విషయం ఏంటీ అంటే కాస్ట్ కట్టింగ్ కారణంగా జబర్దస్త్ నుండి కొన్నాళ్ల పాటు తొలగించారట.
ఆది మరియు సుధీర్ లు లేకుండా కూడా అదే స్థాయి రేటింగ్ వస్తే వారిద్దరు ఉండాల్సిన అవసరం లేదు కదా అంటూ మల్లెమాల వారు ప్లాన్ చేశారట.అందులో భాగంగానే జబర్దస్త్ నుండి ఆది మరియు సుడిగాలి సుధీర్ ఇంకా గెటప్ శ్రీనులను తొలగించారనే వార్తలు వస్తున్నాయి. మొదట వారు తప్పుకున్నారు.. పారితోషికం ఇష్యూ అనే ప్రచారం జరిగింది. కాని అసలు విషయం ఏంటీ అంటే మల్లెమాల వారు కాస్ట్ కట్టింగ్ పేరుతో వారిని తొలగించారు. రేటింగ్ మరీ దారుణంగా పడిపోతే అప్పుడు వారిని తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నారట. మరి వారు మళ్లీ వస్తారా లేదా అనేది చూడాలి.