ETV Jathi Ratnalu : ఈటీవీ జాతిరత్నాలు… అంతా బాగానే ఉంది కాని ఆ ఒక్కటి మైనస్ అయ్యేలా ఉంది!
ETV Jathi Ratnalu : సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టీవీ ప్రస్తుతం పూర్తిగా కామెడీ షోల పై మాత్రమే నడుస్తుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు డాన్స్ షో అయినా ఢీ లో కూడా కామెడీని చొప్పించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి కాకుండా అప్పుడప్పుడు పండుగ సందర్భంగా అంటూ కామెడీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రేక్షకులను […]
ETV Jathi Ratnalu : సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టీవీ ప్రస్తుతం పూర్తిగా కామెడీ షోల పై మాత్రమే నడుస్తుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు డాన్స్ షో అయినా ఢీ లో కూడా కామెడీని చొప్పించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి కాకుండా అప్పుడప్పుడు పండుగ సందర్భంగా అంటూ కామెడీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తూనే ఉన్నారు. కేవలం ఈ కారణంగానే ఈ టీవీ కి టాప్ పొజిషన్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర చానల్స్ కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ రియాల్టీ షోలు షోలు అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఈ టీవీ వారు మాత్రం సింపుల్ గా కామెడీ షో లతో వచ్చేస్తోంది.ఈటీవీ కి వర్తింపజేసి సూత్రాన్ని ఇప్పుడు ఈటీవీ ప్లస్ కి వర్తింప చేసేందుకు వారి టీమ్ సిద్ధమైంది. ఈటీవీ ప్లస్ ద్వారా గత కొంత కాలంగా కామెడీ కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని షో లు వచ్చి వెళ్ళిపోయాయి. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా మరి కొన్ని మాత్రం నిరాశ పరిచాయి. పటాస్ సుదీర్ఘ కాలంగా కొనసాగి సక్సెస్ గా ముగిసింది. ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షో రాబోతుంది.ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి ఈటీవీ ప్లస్ లో ప్రసారం కాబోతున్న ఈ కామెడీ షో కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే.
మల్లెమాల వారు ఈ షో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక మల్లెమాల వారి నుండి వస్తున్న మరో ఆసక్తికర ప్రాజెక్టుగా దీన్ని చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అంశాలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహానికి కలిగిస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇలాంటి షో లు వారంలో కేవలం ఒక రోజు మహా అయితే రెండు రోజులు వస్తే బాగుంటాయి. కాని ఇలా వారం అంతా వస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తోంది. జాతి రత్నాలు త్వరలోనే ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశాలు లేక పోలేదని ఇప్పుడే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక టెలికాస్ట్ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా సూచిస్తున్నారు.