Sreemukhi : ఈటీవీ ప్లస్ ను లేపేందుకు శ్రీముఖితో మల్లెమాల వారి మరో ప్రయత్నం.. ఈసారైనా వర్కౌట్‌ అయ్యేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : ఈటీవీ ప్లస్ ను లేపేందుకు శ్రీముఖితో మల్లెమాల వారి మరో ప్రయత్నం.. ఈసారైనా వర్కౌట్‌ అయ్యేనా?

 Authored By prabhas | The Telugu News | Updated on :22 March 2022,6:00 pm

Sreemukhi : ప్రస్తుతం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ టీవీ, స్టార్ మా, జీతెలుగు మరియు జెమినీ టీవీలో మధ్య పోటీ పతాక స్థాయిలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జెమినీ టీవీ ఈ రేసులో వెనకబడి పోయింది. సీరియల్ మరియు ప్రత్యేక కార్యక్రమాల విషయంలో ఆ చానల్ యొక్క పర్ఫార్మెన్స్ జీరో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ సినిమా లను జెమినీ టీవీ కొనుగోలు చేసి రేటింగ్ లో నిలిచే ప్రయత్నాలు చేస్తోంది.ఇక స్టార్ మా మరియు జీ తెలుగు ఛానల్స్‌ నువ్వా నేనా అన్నట్లు గా పోటీ పడుతున్నాయి.

స్టార్ మా నెంబర్ వన్ గా ఉండగా జీ తెలుగు కూడా అదే స్థాయిలో నిలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పోటీలో గట్టి పోటీని ఇస్తున్న ఈటీవీ రేటింగ్‌ విషయంలో అటూ ఇటూ కాకుండా మధ్యలో ఊగిసలాడుతుంది. ఈటీవీ సీరియల్స్ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహంతో ఉన్నారు.. కొత్త సినిమాలను భారీగా తీసుకు వచ్చేందుకు నిధులను ఈటీవీ వారు ఖర్చు చేయడం లేదు. కానీ మల్లె మాల వారి దయతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఈటీవీ టాప్‌ లో నిలుస్తుంది. ఇప్పుడు మల్లెమాల వారు ఈటీవీ ప్లస్ ఛానల్ ని టాప్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ టీవీ ప్లస్ లో కొన్ని కామెడీ కార్యక్రమాలను చేసినా కూడా అవి విఫలమయ్యాయి.

mallemala tv bring Sreemukhi jathiratnalu comedy show for etv plus

mallemala tv bring Sreemukhi jathiratnalu comedy show for etv plus

ఇప్పుడు మరోసారి శ్రీముఖి యాంకర్ గా జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షో తీసుకు వచ్చేందుకు మల్లెమాల వారు సిద్ధమయ్యారు. శ్రీముఖి యాంకర్ గా దాదాపు 50 మంది కమెడియన్స్ తో ఈ షో ప్రారంభం కాబోతుంది. ఈటీవీ ప్లస్ లో వచ్చే నెల మొదటి వారం నుండి ప్రారంభం అవ్వబోతున్నట్లు గా తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఈటీవీ ప్లస్ లో పటాస్ కార్యక్రమంతో మల్లెమాల వారు మంచి సక్సెస్ అయ్యారు. మళ్లీ ఆ రేంజి సక్సెస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షో ఈటీవీ ప్లస్ కి కచ్చితంగా ఈ టీవీ మరియు జీ తెలుగు స్థాయి లో రేటింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది