Jathi Ratnalu : జాతిరత్నాలు మరో ‘రెచ్చి పోదాం బ్రదర్‌’ అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jathi Ratnalu : జాతిరత్నాలు మరో ‘రెచ్చి పోదాం బ్రదర్‌’ అవుతుందా?

 Authored By prabhas | The Telugu News | Updated on :12 April 2022,10:00 am

Jathi Ratnalu : ఈ టీవీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ రంగం లో సూపర్ హిట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ చానల్ తరహాలోనే ఈటీవీ ప్లస్ ఛానల్ ని కూడా సూపర్హిట్ చేసేందుకు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ టీవీ సక్సెస్ లో కీలక పాత్ర కచ్చితంగా జబర్దస్త్ కార్యక్రమంకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో టాప్ పోజిషన్ లో ఈటీవీ నిలిచింది అంటే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా మూడు నాలుగు షోలు కారణం అనడంలో ప్రత్యేకంగా సందేహం అక్కర్లేదు.

ఇప్పుడు అదే కామెడీ కార్యక్రమాలతో ఈటీవీ ప్లస్ ని కూడా సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈటీవీ ప్లస్ ప్రారంభమైన సమయం లోనే పటాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం మంచి సక్సెస్ను దక్కించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలా కాలం తర్వాత పటాస్ కార్యక్రమాన్ని నిలిపి వేశారు. మళ్లీ ఆ తరహా ఆ రేంజ్ కామెడీ కార్యక్రమాన్ని తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఆ మధ్య రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఆ కార్యక్రమం లో యాంకర్గా మేఘన వ్యవహరించింది.

etv pulse new show jathi ratnalu rating

etv pulse new show jathi ratnalu rating

రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరించారు. కొన్ని ఎపిసోడ్ల కు బాబా మాస్టర్ కూడా జడ్జ్ గా వచ్చాడు. ఆ కార్యక్రమాన్ని జనాలు ఎక్కువగా ఆదరించ లేదు. కనుక ఆపివేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు జాతి రత్నాలు పేరుతో శ్రీముఖి యాంకర్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు కొత్త వారికి అవకాశం ఇచ్చి స్టాండప్ కామెడీ అంటూ హడావుడి చేశారు. స్టాండప్ కామెడీ కార్యక్రమం ను కూడా జనాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో ఈ కార్యక్రమం కూడా రెచ్చిపోదాం బ్రదర్ కార్యక్రమం తరహాలోనే కొన్ని వారాల్లో కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటీవీ ప్లస్ కి జబర్దస్త్ వంటి ఒక మంచి కార్యక్రమం పడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే నేమో.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది