sreemukhi : ‘జాతిరత్నాలు’ కోసం శ్రీముఖి తీసుకునే పారితోషికం ఎంతంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

sreemukhi : ‘జాతిరత్నాలు’ కోసం శ్రీముఖి తీసుకునే పారితోషికం ఎంతంటే..!

sreemukhi : ఈటీవీ ప్లస్ లో కొత్తగా జాతిరత్నాలు అనే కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి యాంకర్గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీముఖి ఇస్తున్న పారితోషికం ఎంత అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో అనసూయ మరియు రష్మి గౌతమ్ ల స్థాయి లోనే శ్రీముఖి పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మాకు అందిన సమాచారం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 April 2022,1:30 pm

sreemukhi : ఈటీవీ ప్లస్ లో కొత్తగా జాతిరత్నాలు అనే కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి యాంకర్గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీముఖి ఇస్తున్న పారితోషికం ఎంత అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో అనసూయ మరియు రష్మి గౌతమ్ ల స్థాయి లోనే శ్రీముఖి పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం అంత సీన్ లేదని క్లారిటీ వచ్చింది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం శ్రీముఖి ఒక్కొక్క షెడ్యూల్ కి ఆరు లక్షల నుండి ఏడు లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క షెడ్యూల్లో ఒక వారం కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్స్‌ ను చిత్రీకరణ చేస్తారు. తద్వారా ఒక వారానికి వచ్చి శ్రీముఖి కి వారం కు ఆరు నుండి ఏడు లక్షల పారితోషికం అందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకప్పుడు శ్రీముఖి ఇంతకు మించి పారితోషికం దక్కించుకునేది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె స్థాయి తగ్గినట్లుగా అనిపిస్తుంది. అందుకే ఆమె పారితోషికం కూడా తగ్గినట్లు సమాచారం అందుతోంది. మల్లెమాల వారితో కనెక్షన్ ఉండాలని వాళ్లతో కలిసి వర్క్ చేయాలనే కోరికతో శ్రీముఖి చాలా కాలంగా ఉంది.

etv plus jathiratnalu show sreemukhi remunerationvv

etv plus jathiratnalu show sreemukhi remunerationvv

అందుకే ఈ కార్యక్రమానికి ఆమె నో చెప్పకుండా తక్కువ పారితోషికం అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆమె చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లెమాల వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఫలితం ఎలా ఉన్నా కూడా కొన్నాళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అవకాశాలున్నాయి. గతంలో రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమం కొన్నాళ్ళు టెలికాస్ట్ అయ్యి ఆగి పోయింది. ఇప్పుడు అదే తరహాలోనే జాతిరత్నాలు కార్యక్రమం కూడా ఆగిపోయే అవకాశం ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం కార్యక్రమం చాలా కాలం పాటు నడుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది