Faima – Praveen : ఫైమా, ప్రవీణ్‌లది నిజమైన ప్రేమనా అంటే వాళ్లను చూపించిన ఫైమా తల్లి!

Authored By aruna | The Telugu News | Published on: September 15, 2022, 7:00 pm

Faima – Praveen : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ప్రవీణ్ మరియు ఫైమా ప్రేమలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వారు కూడా తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ జబర్దస్త్ స్టేజ్ పై పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా వారిద్దరి యొక్క ప్రేమ కహాని కనిపించింది. ఇద్దరూ వారి వారి యూట్యూబ్ ఛానల్ లో ప్రేమలో ఉన్నట్లుగానే మాట్లాడుకుంటూ.. వ్యవహరిస్తూ వీడియోలు చేయడం మనం చూశాం. నిజంగా ప్రేమలోనే ఉన్నారా అన్నట్లుగా అనిపించే ఈ జంట గురించి ఫైమా అమ్మ గారిని అడిగిన సందర్భంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికి మా అమ్మాయి పూర్తి దృష్టి కెరియర్ మీదే ఉందని, ఆమె వేరే ధ్యాస లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. మరి ప్రవీణ్ తో ప్రేమ విషయం ఏంటి అంటూ ఆమెను ప్రశ్నించగా.. జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ మరియు రష్మీ ల ప్రేమ కథ మాదిరిగానే తన కూతురు ప్రేమ కథ అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇమాన్యుల్ మరియు వర్ష ల యొక్క ప్రేమ ఎంత నిజమో నా కూతురు యొక్క ప్రేమ అంతే నిజం అన్నట్లుగా ఆమె కుండ బద్దలు కొట్టినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. కేవలం టిఆర్పి రేటింగ్ కోసం.. గుర్తింపు తెచ్చుకోవడం కోసం మాత్రమే ప్రవీణ్ తో తన కూతురు సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట.

faima and praveen love story faima mother shocking comments

faima and praveen love story faima mother shocking comments

ఈ విషయం ఆ నోట ఈ నోట పడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఫైమా బిగ్ బాస్ లో ఉంది. అక్కడ ఆమె మంచి ప్రదర్శన ఇచ్చి టాప్ 5 లో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్ లో జబర్దస్త్ చూపించి ఫైమా ఫైటింగ్ చేసి టాప్ లో నిలుస్తుంది అనడం ఎలాంటి సందేహం లేదు. ముందు ముందు కూడా ఈ అమ్మాయి బుల్లి తెర మరియు వెండి తెర పై తనదైన సత్తా చాటి స్టార్ గా నిలవడం ఖాయం. కనుక అలాంటి అమ్మాయి ఇప్పుడు ప్రేమ దోమ అంటూ కెరీయర్ ని నాశనం చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది చాలా మంది అభిప్రాయం. ప్రవీణ్ కూడా మంచి కమెడియన్.. అతడు ప్రేమ అంటూ కెరియర్ ని నాశనం చేసుకోకుండా కెరీర్‌ పై దృష్టి పెట్టాలని అతడి సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  2. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  3. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  4. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  5. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  6. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  7. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp