Buchi Babu : టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఉప్పెన సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. మొదటి సినిమాతో రూ.100 కోట్ల వసూళ్లను దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాని అంతే స్పీడుగా, అదే జోష్ తో చేయాల్సి ఉంది. రూ. 100 కోట్ల సినిమా చేసిన కొత్త దర్శకుడు వెంటనే మరో సినిమాను చేసి సక్సెస్ దక్కించుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీ దర్శకుల సరసన నిలిచే అవకాశం ఉంటుంది కానీ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేశాడు..
ఎన్టీఆర్ తో సినిమా అంటే చాలా గొప్ప విషయం, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ని తన కథతో ఒప్పించడం నిజంగా బుచ్చిబాబు యొక్క గొప్పతనం మరియు ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనం. అలాంటి బుచ్చిబాబు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈయన బుచ్చిబాబు కాదు పిచ్చి బాబు అంటూ చాలా మంది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అందుకు ఆయనపై అభిమానం కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. అసలు విషయానికి వెళ్తే ఉప్పెన సినిమా వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తుంది. అయినా ఇప్పటి వరకు బుచ్చిబాబు తన తదుపరి సినిమాని మొదలుపెట్టిందే లేదు.
ఆయన సినిమా ఎప్పటికీ ప్రారంభమవుతుందో అనేది క్లారిటీ లేదు, ఎన్టీఆర్ తో సినిమా అంటే చాలా కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాలు చేయడానికి రెండేళ్ల సమయమైనా ఎన్టీఆర్ కి పడుతుంది. అంటే వచ్చే ఏడాదిలో కూడా బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టే అవకాశం లేదు. కనుక ఎన్టీఆర్ కోసం సంవత్సరాలకు సంవత్సరాలు తన సమయంలో బుచ్చిబాబు ఒక పిచ్చి బాబు మాదిరిగా వృధా చేసుకుంటున్నాడు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరో సినిమాను చేయాలని బుచ్చిబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.