Telangana Paper Leak : తెలంగాణ పేపర్ లీకేజీ మీద సినిమా .. !
Telangana Paper Leak : తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ ఘటనలు BRS ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. TSPSC పేపర్ లీకేజ్ ఘటనతో పాటు పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ పరీక్షా పత్రాల లీకేజ్ ఘటనలను ఆధారం చేసుకుని పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇటీవల ఆయన “యూనివర్సిటీ” అనే సినిమాను చేయటం జరిగింది.
స్నేహ చిత్ర బ్యానర్ లో దర్శక నిర్మాతగా నారాయణ మూర్తి ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ…”యూనివర్సిటీ” సినిమా కంప్లీట్ కావడం జరిగింది. త్వరలోనే ఆడియో కార్యక్రమం నిర్వహించి సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు బీహార్, అస్సాం, మధ్య ప్రదేశ్, గుజరాత్ లతో సహా చాలా రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
10వ తరగతి ప్రశ్నా పత్రాల నుంచి గ్రూప్ 1 2 పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని అన్నారు. ఇలా ప్రశ్నా పత్రాల లీకులు జరుగుతుంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏం కావాలి..? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని ఆర్.నారాయణ మూర్తి అన్నారు. భారతదేశ నిరుద్యోగం భారతం కాకూడదు. విద్యార్థుల జీవితాలు నాశనం కాకూడదు. విద్యావ్యవస్థలో కుంభకోణాల వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆ కోణాన్ని “యూనివర్సిటీ” సినిమాలో చూపించాం అని ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు.