Fish Venkat: రోజు రోజుకి క్షీణిస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం భార్య ఎదురు చూపు.. వీడియో
ప్రధానాంశాలు:
Fish Venkat: రోజు రోజుకి క్షీణిస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం భార్య ఎదురు చూపు.. వీడియో
Fish Venkat: టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి నటుడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నాడు.

Fish Venkat: రోజు రోజుకి క్షీణిస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం భార్య ఎదురు చూపు.. వీడియో
Fish Venkat క్షీణించిన ఆరోగ్యం..
దీని తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అతడున్న పరిస్థితుల్లో డయాలసిస్‌తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు.