Fish Venkat : ఫిష్ వెంకట్ జీవితం విషాదాంతం.. వంద సినిమాలు చేసిన పేదరికమేనా..!
ప్రధానాంశాలు:
Fish Venkat : ఫిష్ వెంకట్ జీవితం విషాదాంతం.. వంద సినిమాలు చేసిన పేదరికమేనా..!
Fish Venkat : పలు సినిమాల్లో కామెడీతో నవ్వులు పంచిన నటుడు ఫిష్ వెంకట్ Fish Venkat, తన చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూశారు. పలు హిట్ చిత్రాల్లో వెంకట్ కనిపించినా, పెద్దగా పేరు, డబ్బు మాత్రం అతడి జీవితంలో నిలవలేదు. పాత్రల పరిమితి, రేమ్యునరేషన్ లోపం, కొన్ని వ్యక్తిగత అలవాట్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి రెండు కిడ్నీలు పాడవడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ… జీవితానికి గుడ్ బై చెప్పాడు.

Fish Venkat : ఫిష్ వెంకట్ జీవితం విషాదాంతం.. వంద సినిమాలు చేసిన పేదరికమేనా..!
Fish Venkat : ఏం మిగల్లేదు..
తన పరిస్థితిపై పలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో బాధ వ్యక్తం చేసిన వెంకట్, టాలీవుడ్ ప్రముఖులను సహాయం కోరాడు. కొంతమంది సినీ ప్రముఖులు స్పందించి సహాయానికి ముందుకొచ్చినా… అప్పటికే పరిస్థితి విషమించిపోయింది. కిడ్నీ మార్పిడికి కావలసిన డబ్బు పూర్తి స్థాయిలో సమకూరకపోవడం వల్ల… వెంకట్ ఆరోగ్యం మరింత దిగజారింది.
వెంకట్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని కలలు కన్నాడు. కానీ జీవితం అతడికి ఇంకే అవకాశాన్ని ఇవ్వలేదు. దాదాపు 20 ఏళ్ల ఇండస్ట్రీ ప్రయాణంలో, ఒక చిన్న ఇంటిని మినహా వెంకట్ ఎలాంటి ఆస్తిని కూడబెట్టలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. చివరి క్షణాల్లో కూడా పోరాడిన వెంకట్‌కు సినీ పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది..