Fish Venkat : నిజంగా సిగ్గు పడాలి.. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రశ్నలు..!
ప్రధానాంశాలు:
Fish Venkat : నిజంగా సిగ్గు పడాలి.. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రశ్నలు..!
Fish Venkat : ఫిష్ వెంకట్ .. తన సినిమాలతో ఎంతో మెప్పించిన నటుడు. కానీ ఆ నటుడు చివరికి ఒక్క “కిడ్నీ మార్పిడి”కి అవసరమైన 60 లక్షలు దొరకక, మౌనంగా కన్నుమూయడం జరిగింది. ఇది కేవలం కుటుంబ సభ్యుల బాధ కాదు, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తలదించుకోవాల్సిన విషాదం. వైద్యానికి 60 లక్షలు కావాలన్నారు… అయిన ఇండస్ట్రీ ఎందుకు సాయం చేయలేకపోయింది?

Fish Venkat : నిజంగా సిగ్గు పడాలి.. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రశ్నలు..!
Fish Venkat : డబ్బులు లేకనే..
60 లక్షలు ఉండుంటే నాన్న బ్రతికేవారు అని వెంకట్ కూతురు చెబుతుంది. పరిశ్రమలో పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఉన్నా – ఒక్కొక్కరూ రూ. 10,000 చొప్పున ఇచ్చినా 600 మంది చాలు… మొత్తం అవసరమైన డబ్బు పూర్తవుతుంది కదా? అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నిజంగా ‘సినీ కుటుంబం’ ఉందా? ఎన్నో సంఘాలు ఉన్నాయి అంటారు…
అవి నిజంగా ఏ నటుడి కోసం పనిచేస్తున్నాయో తెలియదు. ఒక్క ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా, అత్యవసర సహాయ నిధి అయినా ఉన్నాయా? లేక వేదికలపై మాటలకే పరిమితమా? ఎందరో స్టార్లతో కలిసి వర్క్ చేసిన హాస్యనటుడు ఫిష్ వెంకట్. కానీ అవసరమైన సమయంలో అతడికి సాయం చేయలేక ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది. డబ్బు లేకపోతే ఎంతటి నటుడైనా ప్రాణం కోల్పోతాడన్న విషయాన్ని ఇది నిజం చేసింది. ఇది వ్యక్తిగతంగా కాదు… మొత్తం పరిశ్రమ వైఫల్యం. ఈ రోజు వెంకట్… రేపు ఇంకొకరు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా… జాగ్రత్త పడండి. మారండి అంటూ కొందరు నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.