రెడ్ సినిమా కి ఫ్లాప్ టాక్.. కలెక్షన్స్ మాత్రం కిరాక్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రెడ్ సినిమా కి ఫ్లాప్ టాక్.. కలెక్షన్స్ మాత్రం కిరాక్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :15 January 2021,12:04 pm

రెడ్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల మూందుకు వచ్చిన సంగతి రెలిసిందే. రెడ్ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని డ్యూయల్ రోల్ లో నటించాడు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన రెడ్ సినిమాలో మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించగా హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ ల్లో అందాలను ఆరబోసింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత వచ్చిన రెడ్ సినిమా మీద ప్రేక్షకుల్లో .. ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Red movie release LIVE UPDATES | Entertainment News,The Indian Express

రాం కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ మళ్ళీ రిపీటవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రముఖ ఓటీటీ ల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా ససేమిరా అని రెడ్ సినిమాని థియేటర్స్ వరకు తీసుకు వచ్చాడు. కాని రాం కి రెడ్ సినిమా షాకిచ్చిందని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజైన రెడ్ సినిమాకి ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. మొత్తానికి డే వన్ అయ్యేసరికి రెడ్ సినిమా మీద కాస్త నెగిటివ్ టాక్ కొనసాగింది.

రెడ్ ఫ్లాప్ .. కాని డీసెంట్ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి ..?

కాని ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే రెడ్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి వసూళ్ళు బావున్నాయట. 50 పర్సెంట్ ఆక్యూపెనీ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పుకుంటున్నారు. వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజులు కూడా రాం రెడ్ సినిమాకి మచి వసూళ్ళు దక్కుతాయని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరీ డిజాస్టర్ అన్న టాక్ లేకపోవడం రెడ్ సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. చూడాలి మరి లాంగ్ రన్ ఈ సినిమా వసూళ్ళు ఏవిధంగా ఉంటాయో. ఇక ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా తమిళ హిట్ సినిమా తడం కి అఫీషియల్ రీమేక్ గా స్రవంతి రవికిషొర్ నిర్మించాడు.

 

Advertisement
WhatsApp Group Join Now

Tags :

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది