Gaddar Film Awards : గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్.. ఎప్ప‌టి నుండి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gaddar Film Awards : గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్.. ఎప్ప‌టి నుండి అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 January 2025,11:01 am

ప్రధానాంశాలు:

  •  Gaddar Film awards : గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్.. ఎప్ప‌టి నుండి అంటే..!

Gaddar Film awards :  సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో త‌న‌దైన మార్క్ చూపిస్తూ వ‌స్తున్న రేవంత్ Revanth Reddy సర్కారు ఇప్పుడు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా వాళ్లకు ఏటా ఉగాది పండుగకు నంది అవార్డుల పురస్కారాలు ప్రదానం చేయగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయం కొన‌సాగ‌లేదు. పదేళ్లుగా సినిమా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎలాంటి అవార్డులు అందజేయలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మళ్లీ సినిమా వాళ్లకు అవార్డులు అందించి ప్రోత్సహించాలని తలచింది. ఇందులో భాగంగానే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సరికొత్త సంప్రదాయానికి తెర లేపారు.

Gaddar Film Awards గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఎప్ప‌టి నుండి అంటే

Gaddar Film Awards : గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్.. ఎప్ప‌టి నుండి అంటే..!

Gaddar Film awards ముహూర్తం ఫిక్స్..

ప్రజా యుద్ధనౌక గద్దర్ సేవలను స్మరిస్తూ.. సినిమా వాళ్లకు ఇచ్చే అవార్డులను గద్దర అవార్డులుగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇన్ని రోజులు పలు కారణాల వల్ల ఆ నిర్ణయం నిర్ణయంగానే ఉంది. కాగా.. ఇప్పుడు దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉగాది Ugadi నుంచి ప్రతి ఏటా గద్దర్‌ తెలంగాణ Telangana చలనచిత్ర అవార్డులను ప్రదానం యాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. శనివారం సచివాలయంలో గద్దర్‌ అవార్డుల కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత పెంపు, సాంస్కృతిక, విద్య, సామాజిక సంబంధిత చిత్రాలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ ఈ అవార్డులను అందజేయనున్నాము. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ అవార్డులను అందజేస్తున్నాము’ అని ఆయన పేర్కొన్నారు.గద్దర్ Gaddar అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది