Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసిన లేడీ కండక్టర్ కి మల్లెమాల ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసిన లేడీ కండక్టర్ కి మల్లెమాల ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,6:40 pm

Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వారిని బుల్లి తెరకు పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకు ఎప్పుడు బుల్లి తెరపై కనిపించని ప్రతిభావంతులని పరిచయం చేయడం ద్వారా గొప్ప కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. కామెడీ చేసే వారిని మాత్రమే కాకుండా డాన్స్ చేసే వారిని మిమిక్రీ చేసే వారిని పాటలు పాడే వారిని ఇలా టాలెంట్ ఏది ఉన్నా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ప్రోత్సహిస్తూ తమ షో కీ మంచి రేటింగ్ను తీసుకోవడంతో పాటు వారికి కూడా మంచి గుర్తింపుని తెచ్చి పెడుతున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి గాజువాక ఆర్టీసీ డిపోకు చెందిన ఒక లేడీ కండక్టర్ వచ్చింది.

ఆమె చేసిన మాస్ డాన్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె డాన్స్ కి అక్కడ ఉన్న వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా లేచి నిల్చుని ఆమెతో పాటు డాన్స్ వేసే స్థాయిలో ఆమె మాస్ ఊపుడు డాన్స్ ఉంది అనడంలో సందేహం లేదు. ఆమెను ఎలా పట్టుకు వచ్చారో ఏమో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆమె ఇప్పుడు ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ లేడీ కండక్టర్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యి కూర్చుంది, ఆమె డాన్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. చిన్న సినిమాలు వారు మాత్రమే కాకుండా పెద్ద సినిమాల వారు కూడా ఆమెకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చే స్థాయిలో ఆమె డాన్స్ ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ స్థాయిలో డాన్స్ చేసిన ఆ లేడీ కండక్టర్ కి ఈటీవీ మల్లెమాల వారు ఇచ్చిన పారితోషకం ఎంత అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Gajuwaka lady bus conductor dance performance in Sridevi Drama Company

Gajuwaka lady bus conductor dance performance in Sridevi Drama Company

ఆమె రెండు రోజుల పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం డేట్లు కేటాయించింది. అందుకోగాను మల్లె మాలవారు ఆమెకు రెండున్నర లక్షల వరకు పారితోషకంగా ఇచ్చారంటూ సమాచారం అందుతుంది. ఆమెకు ఆ పారితోషకం తక్కువే అయినా కూడా కచ్చితంగా ఈటీవీలో ఆమె కనిపించడం ద్వారా అద్భుతమైన ఆఫర్లు ఆమెకు వస్తాయి. ముందు ముందు ఆమె కండక్టర్ గా జాబ్ చేయకపోవచ్చు, ఆమె ఇకపై వరుసగా స్టేజి షోలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. కనుక ఆమెకు ఇది మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు. పారితోషికం విషయం పక్కన పెడితే ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె కనిపించడమే గొప్ప విషయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఒక మంచి ప్రతిభావంతురాలిని బుల్లి తెరకు, ప్రేక్షకులకు పరిచయం చేశారు అనడంలో సందేహం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది