Bigg Boss 8 Telugu : గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా.. అస‌లు కార‌ణం ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా.. అస‌లు కార‌ణం ఏంటి ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 కార్య‌క్ర‌మం రోజు రోజుకి ప‌లు ట్విస్ట్‌ల‌తో సాగుతుంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా ప్రేక్ష‌కుల‌కి అంత‌గా అర్ధం కావ‌డం లేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో మరింత కామెడీ, గొడవలు, ఫైట్స్ జరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక నామినేష‌న్స్ ర‌చ్చ‌తో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. మ‌రోవైపు ప్ర‌తి […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా.. అస‌లు కార‌ణం ఏంటి ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 కార్య‌క్ర‌మం రోజు రోజుకి ప‌లు ట్విస్ట్‌ల‌తో సాగుతుంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా ప్రేక్ష‌కుల‌కి అంత‌గా అర్ధం కావ‌డం లేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో మరింత కామెడీ, గొడవలు, ఫైట్స్ జరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక నామినేష‌న్స్ ర‌చ్చ‌తో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. మ‌రోవైపు ప్ర‌తి వారం కూడా హౌజ్ నుండి ఒక్కొక్క‌రుగా ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు.ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుండ‌గా,ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చింది.

Bigg Boss 8 Telugu ముందే ఎలిమినేష‌న్..

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఈవారం మధ్యలోనే ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడనుందని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక పావని, మెహబూబ్ నామినేట్ కాగా, వీరు కాకుండా మధ్యలో గంగవ్వ వాలంటీర్‌గా ఎగ్జిట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. గంగవ్వపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ గంగవ్వతోపాటు యూట్యూబర్ రాజుపై జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. దీంతో గంగ‌వ్వ ఈ సారి కూడా మ‌ధ్య‌లోనే హౌజ్ నుండి వెళ్ల‌నుంద‌ని టాక్.

Bigg Boss 8 Telugu గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా అస‌లు కార‌ణం ఏంటి

Bigg Boss 8 Telugu : గంగ‌వ్వ‌ని మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి పంప‌బోతున్నారా.. అస‌లు కార‌ణం ఏంటి ?

గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్‌తో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ ఛానెల్‌లో పలు వీడియోలు చేస్తూ అలరించింది. రెండేళ్ల క్రితం ఓ వీడియోలో భాగంగా జ్యోతిష్యం కోసం చిలుకను ఉపయోగించారు యూట్యూబర్ రాజు, గంగవ్వ. 2022, మే 20న గంగవ్వ చిలుక పంచాగం అనే వీడియోను అప్‌లోడ్ చేశారు. సొంత ప్రయోజనాల కోసం మూగ జీవాలను హింసించి, వన్య ప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని గౌతమ్ ఫిర్యాదు చేశారు. వినోదం కోసం చిలుకను వాడుకోవడం చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందన్న గౌతమ్ ఆరోపించారు. దాంతో ఇప్పటికే యూట్యూబర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి, గంగవ్వను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ గంగవ్వను అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ వారం గంగవ్వ వాలంటీర్‌గా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కూడా రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేయనున్నారని సమాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది