Bigg Boss : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ సీజన్‌లో ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ని లోపలికి పంపగా.. ఎవరికివారు తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొందరు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో గంగవ్వ కూడా ఒకరు.పల్లెటూరికి చెందిన గంగవ్వ యూట్యూబర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక సినిమా అవకాశాలు సంపాదించుకుంది. అలానే బిగ్ బాస్ అవకాశం కూడా దక్కించుకుంది. సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగవ్వ పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన సింపతీ ఉండేది. అందుకే ఆమెకు భారీగా ఓట్లు పోల్ అయ్యేవి.
కంటెస్టెంట్స్ సైతం గంగవ్వను నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. గంగవ్వను నామినేట్ చేస్తే తాము ప్రేక్షకుల్లో నెగిటివ్ అవుతామని భావించేవారు. హౌజ్‌లో ఉండే ఎయిర్ కండిషనింగ్ కారణంగా , వేళాపాళా లేకుండా నిద్రలేపి టాస్క్స్ ఆడించడం వలన గంగవ్వ అనారోగ్యానికి గురైంది. దాంతో బయటకు వచ్చేసింది. అయితే తిరిగి సీజన్ 8లో గంగవ్వని బిగ్ బాస్ షోకి తీసుకొచ్చారు. మొన్నటి వరకు చాలా యాక్టివ్‌గా కనిపించిన గంగవ్వకి గుండెపోటు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.గత రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కంటెస్టెంట్స్ అందరూ హడలెత్తిపోయారట..ముఖ్యంగా విష్ణు ప్రియకు చెమటలు కూడా పట్టాయనిటాక్. ఇక డాక్టర్స్ టీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఆమెకు సరైన సమయానికి వైద్యం అందించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే .. మరి కొంతమంది ఇది ఫ్రాంక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే గంగవ్వకి గుండెపోటు వచ్చినట్లు నటించిందని ,తోటి కంటెస్టెంట్ లను ఆమె నమ్మించాలి అనేది ఆమెకు ఇచ్చిన టాస్క్ అని, అందులో గంగమ్మ సక్సెస్ అయిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బిగ్ బాస్ షో పై వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయం. ఇలాంటి టాస్క్ లు అటు కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు, కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. సున్నితమైన అంశాల మీద గేమ్స్, టాస్క్స్ సరికాదు అని కొందరు పెదవి విరుస్తున్నారు..
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్‌గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్‌తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.