Bigg Boss : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న గంగ‌వ్వ‌కి గుండెపోటా.. ఇందులో నిజ‌మెంత‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న గంగ‌వ్వ‌కి గుండెపోటా.. ఇందులో నిజ‌మెంత‌?

 Authored By aruna | The Telugu News | Updated on :22 October 2024,3:00 pm

Bigg Boss : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ సీజ‌న్‌లో ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ని లోప‌లికి పంప‌గా.. ఎవరికివారు తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఆ త‌ర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంద‌రు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో గంగ‌వ్వ కూడా ఒక‌రు.ప‌ల్లెటూరికి చెందిన గంగ‌వ్వ యూట్యూబ‌ర్ గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. ఇక సినిమా అవ‌కాశాలు సంపాదించుకుంది. అలానే బిగ్ బాస్ అవ‌కాశం కూడా ద‌క్కించుకుంది. సీజ‌న్ 4లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగ‌వ్వ పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన సింపతీ ఉండేది. అందుకే ఆమెకు భారీగా ఓట్లు పోల్ అయ్యేవి.

Bigg Boss : ఏది నిజం?

కంటెస్టెంట్స్ సైతం గంగవ్వను నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. గంగవ్వను నామినేట్ చేస్తే తాము ప్రేక్షకుల్లో నెగిటివ్ అవుతామని భావించేవారు. హౌజ్‌లో ఉండే ఎయిర్ కండిషనింగ్ కారణంగా , వేళాపాళా లేకుండా నిద్రలేపి టాస్క్స్ ఆడించ‌డం వ‌ల‌న గంగ‌వ్వ అనారోగ్యానికి గురైంది. దాంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే తిరిగి సీజ‌న్ 8లో గంగ‌వ్వ‌ని బిగ్ బాస్ షోకి తీసుకొచ్చారు. మొన్న‌టి వ‌ర‌కు చాలా యాక్టివ్‌గా క‌నిపించిన గంగ‌వ్వ‌కి గుండెపోటు వచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.గత రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కంటెస్టెంట్స్ అందరూ హడలెత్తిపోయారట..ముఖ్యంగా విష్ణు ప్రియకు చెమటలు కూడా పట్టాయనిటాక్. ఇక డాక్టర్స్ టీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఆమెకు సరైన సమయానికి వైద్యం అందించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే .. మరి కొంతమంది ఇది ఫ్రాంక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకే గంగవ్వకి గుండెపోటు వచ్చినట్లు నటించిందని ,తోటి కంటెస్టెంట్ లను ఆమె నమ్మించాలి అనేది ఆమెకు ఇచ్చిన టాస్క్ అని, అందులో గంగమ్మ సక్సెస్ అయిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బిగ్ బాస్ షో పై వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయం. ఇలాంటి టాస్క్ లు అటు కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు, కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. సున్నితమైన అంశాల మీద గేమ్స్, టాస్క్స్ సరికాదు అని కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది