garikapati fire on allu arjun pushpa
Allu Arjun: ప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవధాని గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు తనదైన స్టైల్ లో ప్రవచనాలు ఇస్తూ నేటి కాల పరిస్ధితుల గురించి ఉన్నది ఉన్నట్లు క్లీయర్ గా మొహానే చెప్పేస్తుంటారు. అతను తరచుగా చిటికెడు వ్యంగ్యం కామెడీతో నిజ జీవిత ఉదాహరణలను జతచేస్తాడు. తాజాగా ఆయన పుష్ప సినిమాని ఉదాహరణగా తీసుకొని అల్లు అర్జున్, సుకుమార్‌ని కడిగిపారేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గరికపాటి వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి.
పిల్లల మనస్తత్వాలు, వారి ఎదుగుదల గురించి ప్రవచనం చేస్తున్న గరికపాటి.. రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్పపై విమర్శలు కురిపించారు. రీసెంట్ గా వచ్చిన పుష్ఫ సినిమాలో స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించారని అన్నారు. చివరిలో 5 నిమిషాలు మంచిగా చూపిస్తామని..పుష్ప 2 లో చూపిస్తామని చెబుతున్నారని అప్పటి వరకూ సమాజం చెడిపోదా అంటూ మండిపడ్డార పుష్ఫ సినిమా హీరో గానీ డైరెక్టర్ గానీ దీనిపై తనకు సమాధానం చెప్పాలని గరికపాటి నిలదీశారు. ఇంకా తగ్గేదే లే అంటూ స్మగ్లర్లకు డైలాగులు ఏంటని ప్రశ్నించారు.
garikapati fire on allu arjun pushpa
మంచి తనం ఉన్న హీరోను చూపించిన సినిమా ఒక్కటైనా వస్తుందా….వస్తే ఆడుతుందా ఆడకపోతే వదిలేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి దండ్రులు పిల్లల మార్కులు చూసి వాడిని హీరోను చేయొద్దని గరికపాటి అన్నారు. అలా చేస్తే వాడు చివరికి జీరో అవతాడంటూ వ్యాఖ్యానించారు. తగ్గేదే లే అని ఎవరు అనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామ చంద్రుడు లాంటి వాడు వాడాలి.. ఒక స్మగ్లర్ వాడటం ఏంటండి ఆ డైలాగ్? ఇవీ జరుగుతున్న అన్యాయాలు. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి.. దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం. దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం.. ఒకడు హీరోయిన్‌ని ప్రేమిస్తాడు.. ఆమె కోసం రూ. 20 వేల విలువైన నగలు దొంగతనం చేస్తాడు. అది చూపిస్తాడు.. వాడిని హీరోగా చూపిస్తాడు! అక్కడి నుంచి సమాజంలో అమ్మాయిల కోసం దొంగతనాలు మొదలవుతాయి అంటూ గరికపాటి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Today Gold Rate : బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి.…
Gautam Gambhir : భారత క్రికెట జట్టు Indian Head Coach హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి భయానక ఉగ్రవాద…
Kashmir Pahalgam : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో kashmir pahalgam జరిగిన ఉగ్రదాడి terror attack దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం…
Astrology : మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాటికవే పరిష్కారం దొరుకుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఒకటి డబ్బు లేకపోవడం, మరొకటి…
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
This website uses cookies.