
mahesh babu trivikram srinivas combo movie launched
Mahesh Babu: అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అనౌన్స్‌మెంట్ రాగా, ఈ రోజు మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
దర్శకుడు త్రివిక్రమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. షూటింగ్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘SSMB28’ మహేష్ బాబు, త్రివిక్రమ్, థమన్, పూజా హెగ్డే మరియు హారిక హాసిని క్రియేషన్స్ కలయికలో రాబోతోంది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.
mahesh babu trivikram srinivas combo movie launched
ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతుంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుది. మేకర్స్ దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ విడుదల చేశారు. మరో వైపు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన వర్క్‌ను పూర్తి చేశారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.