Geetu Royal : జ‌బ‌ర్థ‌స్త్ బ్యూటీని ఆటాడేసుకుంటున్న ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్.. క‌న్నీరు పెట్టుకున్న గీతూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Geetu Royal : జ‌బ‌ర్థ‌స్త్ బ్యూటీని ఆటాడేసుకుంటున్న ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్.. క‌న్నీరు పెట్టుకున్న గీతూ

 Authored By sandeep | The Telugu News | Updated on :11 August 2022,5:40 pm

Geetu Royal : సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో గ‌లాటా గీతూ ఒక‌రు. బిగ్‌బాస్‌ రివ్యూలతో బాగా ఫేమస్ అయిత‌న గీతూ రాయల్ జ‌బ‌ర్ధ‌స్త్ షోలోను సంద‌డి చేస్తుంది. టిక్‌టాక్ వీడియోలు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్‌తో ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది.బిగ్ బాస్ సీజ‌న్ 6కి ఈ అమ్మ‌డు సెల‌క్ట్ అయిన‌ట్టు టాక్. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ఓ వీడియోలో త‌న బాడి షేమింగ్ విష‌యమై క‌న్నీరు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్‌ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంటసేపు ఏడ్చింది.

Geetu Royal : అడ్డంగా బుక్..

‘నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్‌ చేశారు. అందుకని నేను చాలా వరకు బాడీని కవర్‌ చేసేలా డ్రెస్సులు వేసుకున్నాను. కానీ ఇటీవలే నా కజిన్స్‌, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని చెప్పారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నా. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్‌ చేయొద్దు’ అంటూ ఏడ్చేసింది. ఇటీవలే నా కజిన్స్‌, ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ముందు నా బాడీని ప్రేమించమని చెప్పారు. నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను అంటూ గీతూ చెప్పుకొచ్చింది.

Geetu Royal Cried About Comments of Her Body

Geetu Royal Cried About Comments of Her Body

ఈ వీడియోని చూసి షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ గీతూని ట్రోల్ చేస్తున్నారు. గతంలో గీతూ బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పింది. ఆ సమయంలో షణ్ముఖ్ ని ఒక ఆట ఆడుకుంది. షణ్ముఖ్ ని బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసింది గీతూ. ఇప్పుడు గీతూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడటంతో షన్ను ఫ్యాన్స్.. నువ్వు గతంలో షణ్నును బాడీ షేమింగ్‌ చేయలేదా? అతడిని తిట్టలేదా? ఇప్పుడు నిన్ను అంటే తప్పా? అని కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది