Samantha : జర్మనీ నుంచి వచ్చిన డాక్టర్ సమంత పరిస్థితి చూసి ఒకే ఒక్క మాట అన్నాడు.. కష్టమేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : జర్మనీ నుంచి వచ్చిన డాక్టర్ సమంత పరిస్థితి చూసి ఒకే ఒక్క మాట అన్నాడు.. కష్టమేనా..?

 Authored By ramesh | The Telugu News | Updated on :31 October 2022,5:02 pm

Samantha : సమంతకు సోకిన మయోసైటిస్ వ్యాధి గురించి బయటకు చెప్పడమే ఆలస్యం ఆమెకు సోకిన ఆ వ్యాధి గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసలు ఈ మయోసైటిక్స్ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలా వస్తుంది.. ఎన్నాళ్లకు తగ్గుతుంది అని డిస్కస్ హేస్తున్నారు. అయితే సమంత దీన్ని చాలా రోజులు దాచి పెట్టడం వల్ల ఆమెకి తీవ్ర స్థాయిలో ఉందని అంటున్నారు. ముందు లక్షణాలు కనిపించగానే డాక్టర్ ని కన్సల్ట్ అయితే మరీ ఇంత తీవ్రంగా ఉండేది కాదని టాక్. అంతేకాదు సమంత కి ఇది ముదరడం వల్లే ఇబ్బందులు పడుతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమంత కోసం ఫారిన్ డాక్టర్స్ వస్తున్నారు. ముఖ్యంగా జర్మనీ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారట. ఆయన పర్యవేక్షణలోనే సమంతకు ట్రీట్ మెంట్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే సమంత వ్యాధి లక్షణాలు చూసి సమంత భయపడుతున్నా సరే ఆమె మరో 3 నెలల్లో మాములు స్థితికి వస్తుందని అన్నారట డాక్టర్. అంతేకాదు 3 నెలల్లో ఆమె తన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చని చెప్పారట. నిజంగా ఈ వార్త సమంతకే కాదు తన ఫ్యాన్స్ కి మంచి ఊపు ఇచ్చింది. సమంత కి వ్యాధి సోకింద తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఒకటే కంగారు.. కానీ సమంత వీటినన్నిటినీ ఎదుర్కుని బయటకు వస్తుందని అంటున్నారు.

german doctor revealed Samantha health position

german doctor revealed Samantha health position

జర్మనీ డాక్టర్ సలహా మేరకే సమంత తన ట్రీట్ మెంట్ చేయించుకుంటుందట. చేతికి సెలైన్ ఎక్కించుకున్న ఫోటో బయట పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత ఇక మీదట తన ట్రీట్ మెంట్ ఫోటోలు ఏవి బయటకు రాకూడదని అనుకుంటుందట. తప్పకుండ సమంత త్వరలోనే మళ్లీ మాములు మనిషిగా అవుతుందని. అలా డాక్టర్స్ ఆమెకి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలుస్తుంది. సమంత ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు ఆమె హెల్త్ అప్డేట్స్ కావాలని అంటున్నారు. అయితే సమంత మాత్రం తన వ్యాధి గురించి బయట పెట్టే తప్పుచేశానని ఇప్పుడు అప్డేట్స్ ఏవి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని తన టీం కి చెప్పిందట.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది