Getup Seenu : సాయం చేయాలని వేడుకుంటున్న గెటప్ శీను.. అసలేమైంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Getup Seenu : సాయం చేయాలని వేడుకుంటున్న గెటప్ శీను.. అసలేమైంది..?

Getup Seenu : బుల్లితెర స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శీను ఒకరు. సుడీగాలి సుధీర్ టీంలో తన దైన గెటప్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాడు. తనదైన పంచెస్, కామెడీ టైమింగ్ తో పాటు కొత్త కొత్త గెటప్స్‌తో జబర్దస్త్ వేదికగా నవ్వుల రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఓ వైపు స్టాండప్ కామెడీ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు పోషించకుంటూ తనదైన విధంగా ప్రేక్షకులను అలరింపజేస్తున్నాడు. సుడీగాలి సుధీర్, […]

 Authored By mallesh | The Telugu News | Updated on :30 January 2022,4:00 pm

Getup Seenu : బుల్లితెర స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శీను ఒకరు. సుడీగాలి సుధీర్ టీంలో తన దైన గెటప్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటాడు. తనదైన పంచెస్, కామెడీ టైమింగ్ తో పాటు కొత్త కొత్త గెటప్స్‌తో జబర్దస్త్ వేదికగా నవ్వుల రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఓ వైపు స్టాండప్ కామెడీ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు పోషించకుంటూ తనదైన విధంగా ప్రేక్షకులను అలరింపజేస్తున్నాడు. సుడీగాలి సుధీర్, ఆటోరాంప్రసాద్, గెటప్ శీను ఈ ముగ్గురు ఒక సూపర్ హిట్ కాంబినేషన్. వీరితో అప్పుడప్పుడు సన్నీ జాయిన్ అవుతుంటాడు.

గెటప్ శీను జబర్దస్త్ లో షో ద్వారా క్లిక్ అయ్యాక చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.విభిన్న ప్రొగ్రామ్స్‌, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్‌లో కూడా తనదైన కామెడీ చేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. శీనుకు తోడుగా సుధర్, రాంప్రసాద్ కూడా ఉంటారు. ఒక్కోసారి శీను ఒక్కడే మేనేజ్ చేస్తుంటాడు. తమ జీవితంలో వెలుగు తీసుకొచ్చిన షో జబర్దస్త్ అని ఈ త్రి మంకీస్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తన కామెడీ టైమింగ్‌తో శీను ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్, సైడ్ రోల్స్ చేశాడు. బుల్లితెరతో పాటు అటు వెండితెరమీద కూడా శీను చాలా బిజీగా మారిపోయాడు. అయితే, ఉన్నట్టుండి శీను ఒక్కసారిగా సాయం కోరుతూ అందరినీ షాక్‌కు గురిచేశాడు.

getup sheen begging for help

getup sheen begging for help

Getup Seenu : సాయం ఆశించేతగా ఏమైంది..

గెటప్ శీను సాయం కోరుతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి అతని కోసం కాదట సాయం కోరేది. రాజమండ్రిలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆనంద్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఖర్చులకు రూ.4లక్షలు అవుతాయని వైద్యులు వెల్లడించారు. వారి కుటుంబం వద్ద అంత డబ్బులు లేకపోవడంతో వారు శీను దృష్టికి తీసుకురాగా.. శీను తను కొంత సాయం చేయడంతో పాటు అభిమానులతో పాటు ఇతరులను కూడా సాయం చేసి ఆనంద్ లైఫ్ సేవ్ చేయాలని కోరుతున్నాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది