Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా… సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా… సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్…!

Roja  : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేపడుతున్నారు. వారి అభిమాన రాజకీయ నాయకులకు అండగా నిలబడి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ , హైపర్ ఆది […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా... సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్...!

Roja  : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేపడుతున్నారు. వారి అభిమాన రాజకీయ నాయకులకు అండగా నిలబడి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ , హైపర్ ఆది వంటి వారు పలుచోట్ల ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు గెటప్ శీను మరియు సుడిగాలి సుధీర్ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి సుదీర్ మరియు గెటప్ శీను పర్యటించారు. ఇక ఇదే సమయంలో పిఠాపురం ప్రసిద్ధ దేవాలయం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లి వాళ్ళిద్దరూ దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గెటప్ శీను సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ….మేము సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుండే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానులం. వారికోసం ఇప్పుడు మేము సాధారణ మనుషుల్లాగే ప్రచారాలు చేస్తున్నామని తెలియజేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తధ్యమని ప్రజలు అంటున్నారు. అంతేకాదు లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవనున్నట్లు తెలుస్తుందని చెప్పారు.అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలుగా సహాయం అందించారని అలాంటి నాయకుడిని గెలిపిస్తే మరింత మంచి చేస్తాడని తెలియజేశారు.

Roja మీరు వస్తే పవన్ గెలుస్తాడా సుడిగాలి సుదీర్ గెటప్ శీను పై రోజా ఫైర్

Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా… సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్…!

Roja : సినీ సెలబ్రిటీల ప్రచారాలపై స్పందించిన రోజా…

ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోజా జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారాలలో పాల్గొనడంపై స్పందించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ….వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే వారిని ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి తప్ప వారిని తిట్టడం వేస్ట్. వాళ్లంతా చిన్న చిన్న షోలు చేసుకుంటూ , క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఉంటారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి ఆరేడుగురు హీరోలు ఉన్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సినీ అవకాశాలు రాకుండా చేస్తారనే భయంతోనే వారంతా జనసేన తరఫున మాట్లాడుతున్నారు కానీ ప్రేమతో కాదని రోజా తెలియజేశారు. ప్రేమ వేరు భయం వేరు అని భయంతో పనిచేసే అలాంటి చిన్న చిన్న వారిని నేను తిట్టాలి అనుకోనని రోజా తెలిపారు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారు కూడా కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ రోజా తెలియజేశారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది