Getup Srinu : వీళ్లను ఎవ్వరూ బాగుచేయలేరు ఛీ ఛీ.. అసహనం బయటపెట్టేసిన గెటప్ శ్రీను | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Getup Srinu : వీళ్లను ఎవ్వరూ బాగుచేయలేరు ఛీ ఛీ.. అసహనం బయటపెట్టేసిన గెటప్ శ్రీను

Getup Srinu : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను ఎంట్రీతో అంతా మారిపోయింది. ఇప్పుడు శ్రీను అదరగొట్టేస్తున్నాడు. మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టు ఉంది. ఒకే స్కిట్లో కాకుండా రెండు స్కిట్లలో శ్రీను ఎంట్రీ ఇస్తున్నాడు. వేరే వారి స్కిట్లో స్పెషల్ కారెక్టర్ వేస్తున్నాడు. ఇక శ్రీను ఇప్పుడు దుమ్ములేపుతున్నాడు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో గెటప్ శ్రీను నిజంగానే తన మనసులోని మాట చెప్పాడా? లేదా స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడా? అన్నది తేలడం లేదు. యమ […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,12:20 pm

Getup Srinu : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను ఎంట్రీతో అంతా మారిపోయింది. ఇప్పుడు శ్రీను అదరగొట్టేస్తున్నాడు. మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టు ఉంది. ఒకే స్కిట్లో కాకుండా రెండు స్కిట్లలో శ్రీను ఎంట్రీ ఇస్తున్నాడు. వేరే వారి స్కిట్లో స్పెషల్ కారెక్టర్ వేస్తున్నాడు. ఇక శ్రీను ఇప్పుడు దుమ్ములేపుతున్నాడు. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో గెటప్ శ్రీను నిజంగానే తన మనసులోని మాట చెప్పాడా? లేదా స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడా? అన్నది తేలడం లేదు. యమ ధర్మరాజుగా గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చాడు. లవర్స్‌లా నటిస్తూ ఫేమస్ అయిన ఆర్టిస్టులందరినీ జోడిగా మార్చి నరకానికి తీసుకొచ్చారు. రాకేష్ సుజాత ఎలా చచ్చారు? అని యముడిలా ఉన్న గెటప్ శ్రీను అడిగితే..

వీళ్ల పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నారు అందుకే చచ్చారు అని రాం ప్రసాద్ అంటాడు. అదేంటి? అని అంటే.. ఒప్పుకోరు కదా? అని ప్రేమించుకున్నారు.. ఇప్పుడు ఒప్పుకున్నారు అని రాం ప్రసాద్ చెప్పడంతో శ్రీను షాక్ అవుతాడు. ఇక వర్ష ఇమాన్యుయేల్ జోడికి లవ్ సాంగ్ వేస్తారు. దీంతో గెటప్ శ్రీను పచ్చి బూతులు తిట్టేస్తాడు. కానీ వాటిని బయటకు అనడు. నువ్ కాదన్న రోజు నా ఊపిరి ఉండదు అని వర్ష చెప్పే డైలాగ్‌కు గెటప్ శ్రీను వింత రియాక్షన్లు ఇస్తాడు. అంతే కాకుండా..

Getup Srinu Frustration on Jabradasth Love Tracks

Getup Srinu Frustration on Jabradasth Love Tracks

ఫైమా ప్రవీణ్‌లు వస్తున్నప్పుడు ఏదో లవ్ సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో వేస్తారు. దీంతో స్టేజ్ దిగి వచ్చి మరీ కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లను తిడతాడు. అవన్నీ అవసరమా? ఏవేవో వేసి.. ఏదేదో క్రియేట్ చేస్తారు.. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు అంటూ అసహనంతో అక్కడి నుంచివెళ్లిపోతాడు గెటప్ శ్రీను. చూస్తుంటే.. బయటి జనాల ఫ్రస్ట్రేషన్‌ను ఇలా శ్రీను బయట పెట్టేసినట్టు కనిపిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది