God Father Movie : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు.
నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనికి. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. తని వరువన్ నుండి నాకు చరణ్‌కి పరిచయం ఏర్పడింది. ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నాపేరుని సూచించారు. చరణ్ బాబు, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్‌ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది.
అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది అని అన్నారు. లూసిఫర్‌లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్‌లో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్‌గా వుంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్‌గా వుంటాయి. అంతే కాదు ఈ సినిమా లోని ఇంటర్వెల్ సీన్‌కి అందరికి పూనకాలు రావడం ఖాయం అంటూ దర్శకుడు చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.