God Father Movie : తెల్లారితే గాడ్ ఫాదర్ రిలీజ్.. ఇంటర్వల్ సీన్ కి థియేటర్ లో పూనకాలు గ్యారెంటీ ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

God Father Movie : తెల్లారితే గాడ్ ఫాదర్ రిలీజ్.. ఇంటర్వల్ సీన్ కి థియేటర్ లో పూనకాలు గ్యారెంటీ !

God Father Movie : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు. స్టైలిష్‌ ఫిల్మ్‌ మేకర్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్‌ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 October 2022,9:00 pm

God Father Movie : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు. స్టైలిష్‌ ఫిల్మ్‌ మేకర్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్‌ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌లు విష‌యాల గురించి చెప్పుకొచ్చారు.

నిర్మాత ఎన్వి ప్రసాద్‌ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనికి. నన్ను మళ్ళీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్‌ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. తని వరువన్‌ నుండి నాకు చరణ్‌కి పరిచయం ఏర్పడింది. ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్‌ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్‌ గారే నాపేరుని సూచించారు. చరణ్‌ బాబు, చిరంజీవి గారికి నచ్చింది. ఫోన్‌ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్‌ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది.

God Father Movie release on interval scene super

God Father Movie release on interval scene super

God Father Movie : పూన‌కాలు క‌న్‌ఫాం..

అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది అని అన్నారు. లూసిఫర్‌లో లేని ఒక కోణం గాడ్‌ ఫాదర్‌లో వుంటుంది. కథని అలానే వుంచి ఫ్రెష్‌ స్క్రీన్‌ ప్లే చేశాను. గాడ్‌ ఫాదర్‌ స్క్రీన్‌ ప్లే చాలా సర్‌ ప్రైజింగ్‌గా వుంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్‌ ప్రైజింగ్‌గా వుంటాయి. అంతే కాదు ఈ సినిమా లోని ఇంట‌ర్వెల్ సీన్‌కి అంద‌రికి పూన‌కాలు రావ‌డం ఖాయం అంటూ ద‌ర్శ‌కుడు చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది