Sudigali Sudheer : జబర్దస్త్ తో స్టార్ హీరో స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న సుడిగాలి సుదీర్ ఇటీవలే ఈటీవీ మల్లెమాల ని వదిలేసిన విషయం తెలిసిందే. హీరోగా వరుస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో తాను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లను వదిలేసినట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుదీర్ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ప్రస్తుతం చేసిన సినిమాలు పెద్దగా ఏమీ లేవు. అందువల్ల సుడిగాలి సుదీర్ చెప్పిన మాటలు నిజం కాదని చాలా మంది అంటున్నారు. స్టార్ మా తో ఒప్పందం పెట్టుకుని ఈటీవీ నుండి ఆయన వెళ్ళాడు అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఇదే విషయం బుల్లి తెర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా స్టార్ మా లో కూడా సుడిగాలి సుదీర్ కనిపించడం లేదు. ఆశ చూపించి స్టార్ మా వారు సుడిగాలి సుదీర్ ని పిలిచి, ఉన్న ఒక్కగానొక్క కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని కూడా ఎత్తేశారు అంటూ సుడిగాలి సుదీర్ యొక్క అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ కి అన్యాయం చేశారంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు చేసిన మోసంకు కనులు తెరుచుకున్న సుడిగాలి సుదీర్ ఇటీవల మంత్రి రోజా (Roja) సాయంతో మళ్ళీ ఈటీవీ లో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ విషయంలో నిజం ఎంతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో స్టార్ మా వారు ఒక బిగ్గెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారని అందులో సుడిగాలి సుదీర్ అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారని.. మొత్తం కార్యక్రమం ఆయన చుట్టూ తిరుగుతుంది కనుక కచ్చితంగా మంచి రేటింగ్ వస్తుంది అనే నమ్మకమును వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఒకటి రెండు వారాల్లో స్టార్ మా వారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఎట్టకేలకు సుడిగాలి సుదీర్ యొక్క అభిమానులకు స్టార్ మా వాళ్లు గుడ్ న్యూస్ చెప్పబోతున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుడిగాలి సుదీర్ యొక్క ప్రతిభను.. అతనికున్న క్రేజ్ ని సద్వినియోగం చేసుకుంటే ఏ షో అయినా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.