Godfather Tickets : టికెట్ రేటు తగ్గించి క్యాష్ చేసుకోవాలనుకుంటున్న గాడ్ ఫాదర్.. మెగా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 1, 2022, 12:30 pm

Godfather Tickets : కరోనా వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు సర్వ సాధారణం అయ్యాయి. ఈక్రమంలో వృధా కర్చులు అనేవి అసలు పెట్టట్లేదు. ఒకప్పుడు అందరు విలసాలాకు ఖర్చు చేస్తుండే వారు కానీ ఇప్పుడు అందరు కూడా రూపాయ్ ఖర్చు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఇదేవిధంగా ఒకప్పుడు నెలలో రిలీజయ్యే సినిమాలను కూడా మిస్ అవకుండా చూసేవారు కానీ ఇప్పుడు థియేటర్లకు ఆడియన్స్ రావడం చాలా అరుదు అయ్యింది.స్టార్ సినిమానా అయినా కూడా థియేటర్ ఫుల్ అవ్వాలంటే కష్టపడాల్సి వస్తుంది. అదీగాక ములిగే నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టు టికెట్ల రేట్లు కూడా పెంచడం మరింత ఇబ్బందిగా మారింది.

సినిమా చూడాలన్న ఆలోచన వచ్చినా నలుగురు కలిసి సినిమాకి వెళ్తే టికెట్ రేటు.. థియేటర్ లో తినుబండారాల రేట్లకు వెయ్యి నుంచి రెండు వేల దాకా అవుతున్నాయని భయపడి డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్ల రేట్లు పెంచడం కొన్ని సినిమాలకు బాగా ఎఫెక్ట్ పడింది.అందుకే ఇప్పుడు స్టార్స్ తమ ఆలోచనని మార్చుకున్నారు. టికెట్ రేట్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవబోతున్న మెగా మూవీస్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా టికెట్ల రేట్లు తగ్గించుకున్నాయని తెలుస్తుంది.ముఖ్యంగా ఆచార్య ఇచ్చిన షాక్ వల్ల గాడ్ ఫాదర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi).

godfather ticket price reduced megastar mega plan

godfather ticket price reduced megastar mega plan

అందుకే చిరు గాడ్ ఫాదర్ (Godfather )కి టికెట్ రేటు తగ్గించారట. అక్టోబర్ 6 నుంచి గాడ్ ఫాదర్ మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ 70 ఎం.ఎం లో టికెట్ రేటు 150 రూపాయలకే అందుబాటులో ఉంది. మొదటి రోజు కూడా దాదాపు అంతే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో ఈ లెక్కన చూస్తే గాడ్ ఫాదర్ సినిమా తక్కువ టికెట్ రేటుకే ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. మెగాస్టార్ మెగా ప్లాన్ నిజంగానే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.మరి తగ్గిన టికెట్ రేట్లతో అయినా చిరు సూపర్ హిట్ కొడతాడా.. కలక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. మళయాళ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ మూవీపై అంచనాలు పెంచింది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp