Rajinikanth : చిరంజీవి గాడ్ ఫాదర్ లో రజినీకాంత్?? సినిమాలో లేడు కానీ జరిగింది ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajinikanth : చిరంజీవి గాడ్ ఫాదర్ లో రజినీకాంత్?? సినిమాలో లేడు కానీ జరిగింది ఇదే

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 October 2022,2:00 pm

Rajinikanth : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ పై ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవడానికి కారణం.. చిరంజీవి గత సినిమా ఆచార్య ఫ్లాప్ అవడం. అది అంతగా ఆడకపోవడంతో చిరంజీవికి ఖచ్చితంగా హిట్ పడాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలోనే వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. లూసిఫర్ సినిమాకు అది రిమేక్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

మలయాళం సినిమా రిమేక్ అయినప్పటికీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అందులోనూ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి ఎంట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే.. చిరంజీవి ఎంట్రీ సీన్ కు, రజినీకాంత్ కు సంబంధం ఉందట. అదేంటో తెలుసా? రజినీకాంత్ కారును ఓసారి సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆపేశారట. సేమ్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అలాంటి సీనే ఉంటుంది. ట్రాఫిక్ లో ఒకరోజు రజినీకాంత్ కారు చిక్కుకుందట. ట్రాఫిక్ పోలీసు వచ్చి సీఎం వెళ్తున్నారు అందుకే కారును ఇక్కడి నుంచి తీయొద్దని చెప్పాడట.

Rajinikanth in Chiranjeevi Godfather movie

Rajinikanth in Chiranjeevi Godfather movie

Rajinikanth : సీఎం కాన్వాయ్ వస్తోందని రజినీకాంత్ కారును ఆపేశారట

ఎంత సమయం పడుతుంది అని రజినీకాంత్ అడిగారట. దీంతో అరగంట సేపు సమయం పడుతుంది సార్ అన్నాడట పోలీస్. అరగంట సేపు దాకా కారు వెళ్లడానికి ఆపడం ఎందుకు అనగానే.. సారీ సార్ ఆర్డర్స్ అని చెప్పాడట. దీంతో రజినీకాంత్ కారు దిగి బయటికి వచ్చి ఓ షాపు దగ్గరికి వెళ్లి సిగరెట్ కొనుక్కొని వెలిగించారట. రజినీకాంత్ ను చూసి అందరూ అక్కడ చుట్టూ చేరారట. దీంతో అక్కడికి అప్పుడే సీఎంగా ఉన్న జయలలిత కాన్వాయి అక్కడికి వచ్చిందట. దీంతో పోలీసులు వచ్చి రజినీకాంత్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారట. ఇదే సీన్ ను చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో పెట్టారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది