Ram Charan : రామ్ చరణ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .. ఎందుకో తెలిస్తే తప్పులేదు అంటారు మీరు కూడా !
Ram Charan : స్టార్ హీరోలు మీడియాతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఫ్లోలో ఏదో ఒకటి అనేస్తే ఆ తర్వాత అది తమకు రివర్స్ లో తగులుతుంది. ప్రస్తుతం ఇలాంటి సందర్భం ఒకటి మెగా పవర్ స్టార్ రాం చరణ్ మీద దారుణమైన ట్రోల్స్ ఏర్పడేలా చేస్తుంది. ఇంతకీ చరణ్ ని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటే.. అతను ఒకప్పుడు చెప్పిన మాటకి.. కట్టుబడకుండా ఉండటమే దీనికి కారణమని తెలుస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే.. అప్పట్లో ఓ ప్రెస్ మీట్ లో సినిమా కలక్షన్స్ ఎనౌన్స్ మెంట్ గురించి కామెంట్ చేశాడు చరణ్.
ఫస్ట్ డే.. సెకండ్ డే ఇంతా అని పోస్టర్స్ వేయడం కరెక్ట్ కాదని. అది కాంట్రవర్సీకి దారి తీస్తుందని. కలక్షన్స్ అనేవి ఇలా పోస్టర్స్ లో వేయడం తన వరకు తప్పేనని అన్నారు చరణ్. అంతేకాదు తన బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో గానీ.. తను భాగస్వామ్యం అయ్యే సినిమాల విషయంలో కానీ ఇలా కలక్షన్స్ పోస్టర్స్ రాకుండా చూసుకుంటానని అప్పట్లో అన్నారు చరణ్. అయితే రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ డే 38 కోట్ల కలక్షన్స్ ని పోస్టర్స్ వేశారు. దీనిపై కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియా టీం కూడా పోస్ట్ షేర్ చేసింది.

netizens trolls on ram charan for fake promise
ఇక్కడే చరణ్ పై విరుచుకు పడుతున్నారు ఆడియన్స్. ఒకప్పుడు తమ బ్యానర్ లో సినిమాలకు ఇలాంటి పోస్టర్స్ వేయనని చెప్పిన చరణ్ ఇప్పుడు ఎలా వేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ మాట తప్పాడని దారుణమైన ట్రోల్స్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఇక చరణ్ చేసే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే గౌతం తిన్ననూరి డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియాగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే డైరక్టర్స్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బాలీవుడ్ డైరక్టర్స్ కూడా చరణ్ తో పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.