God Father 1st Day Collections : మెగా’ఇజం’ చూపిస్తున్న గాడ్ ఫాదర్.. చిరు సినిమా హిట్టు పడితే రీ సౌండ్ ఇలానే ఉంటది..!
God Father 1st Day Collections : మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా డైరక్షన్ లో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం చాలా మార్పులు చేశారు. సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. నయనతార, సత్యదేవ్ ల నటన సినిమాకు ఆకర్షణగా నిలిచింది. అక్టోబర్ 5 దసరా సందర్భంగా రిలీజైన ఈ సినిమా మొదటి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
తెలుగు రెండు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ హంగామా కనిపిస్తుంది. బుధవారం మెగా ఫ్యాన్స్ కోలాహలంతో థియేటర్ల దగ్గర సందడి అదిరిపోయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ కూడా అదిరిపోయాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టాయి. ఏపీ తెలంగాణాలో 13 కోట్ల దాకా మొదటి రోజు వసూళ్లని రాబట్టింది గాడ్ ఫాదర్. రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 90 శాతం ఆక్యుపెన్సీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఏరియా వైజ్ కలక్షన్స్ గురించి చూస్తే..

Chiranjeevi God Father Movie first Day Collections
నైజాం : 3.25 కోట్లు, సీడెడ్ : 3.05 కోట్లు, ఉత్తరాంధ్ర : 1.26 కోట్లు, 0.72 కోట్లు, నెల్లూరు : 0.57 కోట్లు, గుంటూరు : 1.75, కోట్లు, ఈస్ట్ : 1.60 కోట్లు, వెస్ట్ : 0.80 కోట్లు
ఏపీ/ తెలంగాణ కలిపి 13 కోట్లు రాబట్టింది. యూఎస్ లో కూడా గాడ్ ఫాదర్ వసూళ్లు అదిరిపోయాయి. సినిమా 91 కోట్ల దాకా బిజినెస్ చేయగా సినిమా హిట్ అవ్వాలి అంటే 92 కోట్లు టోటల్ రన్ లో రాబట్టాల్సి ఉంటుంది. టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి సినిమా వీకెండ్ వరకు వసూళ్లు అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాని తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. చిరుతో పాటుగా సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా సర్ ప్రైజ్ చేశారు. సినిమాలో ఆయన పాత్ర ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక సినిమాలో నటించిన నయనతార, సత్యదేవ్ పాత్రలు ఆకట్టుకున్నాయి. థమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. మాత్రుక సినిమాలోని మూల కథని తీసుకుని గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కించారు.