KGF Movie : “కేజిఎఫ్” సినిమా ఎఫెక్ట్ బంగారు గనులకు మంచి రోజులు..!!
KGF Movie : “కేజిఎఫ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ “కేజిఎఫ్ 1”, “కేజిఎఫ్ 2”. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలైన “కేజిఎఫ్ 2” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. “కేజిఎఫ్” సినిమా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బంగారుగనుల చుట్టూ తిరిగే స్టోరీగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన టేకింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు.
“కేజిఎఫ్” అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని అర్థం. వాస్తవానికి ఈ బంగారుగనులు కర్ణాటక ఆంధ్ర పరిసర సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాయి. 22 సంవత్సరాల క్రితం మూతపడ్డాయి. “కేజిఎఫ్” బంగారు గనులకు ఎంతో మంచి పేరుంది. అయితే అప్పట్లో ప్రభుత్వం జరిపిన తవ్వకాలలో వెలికి తీసే బంగారం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు… ఎక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న “కేజిఎఫ్” గనుల తవ్వకాలను మూసివేసింది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు “కేజిఎఫ్” పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో “కేజిఎఫ్” నుండి బంగారం వెలికి తీసే దానిపై గనుల శాఖ అధికారులు దృష్టి సారించారు. “కేజిఎఫ్” పరిసరాల్లో బంగారం తీసేందుకు టెండర్లకు పిలుపునివ్వడం జరిగింది. చాలకాలం తర్వాత కేంద్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక కేజిఎఫ్ సినిమా ఎఫెక్ట్ అని ఈ వార్తపై సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు.