Gopichand – Radhakrishna : ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటైతే హిట్టు పడుతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gopichand – Radhakrishna : ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటైతే హిట్టు పడుతుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :18 June 2022,12:00 pm

Gopichand – Radhakrishna : ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటైతే హిట్టు పడుతుందా..? అంటే అది ఎంచుకున్న కథ, దాన్ని సినిమాగా తీసిన తర్వాత చూసిన ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. కథ అద్భుతంగా ఉంటే ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటై భారీ హిట్ సాధించవచ్చు. దీనికి ఉదాహరణ అఖండ. నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వరుసగా 5 సినిమాలు ఫ్లాపుగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమాలు బోల్తా పడుతుంటే ఇక ఆయన పని అయిపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి.

దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అంతే. ఆయన తీసిన వినయ విధేయ రామ, జయ జానకీ నాయక సినిమాలు ఫ్లాపవడంతో మళ్ళీ సినిమా చేయాలంటే ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యతో కలిస్తేనే హిట్ కొట్టగలనని భావించి అఖండ లాంటి అద్భుతమైన కథను రాసుకొని దాన్ని బాలయ్యకు చెప్పి ఒప్పించి ఇద్దరు కలిసి కసితో సినిమా చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్న వారే కావడంతో సినిమా సక్సెస్ కోసం ఎంతో శ్రమించారు. ఆ శ్రమ వృధా కాలేదు. అభిమానులు, ప్రేక్షకులను మెప్పించారు. కాబట్టే వీరికి హిట్ దక్కింది.

Gopichand Radhakrishna The flaps movies

Gopichand Radhakrishna The flaps movies

Gopichand – Radhakrishna : దర్శకుడికి వేరే హీరోలు ఛాన్సులు ఇవ్వడం లేదని టాక్.

అయితే, ఇప్పుడు ఇలాంటి మరో ఫ్లాప్ కాంబినేషన్ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారని తాజా సమాచారం. వారే మాచో హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్. వీరిద్దరు కలిసి చేసిన సినిమా జిల్. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా.
రెండవ సినిమా రాధే శ్యామ్. గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే నిర్మాతలకు నష్ఠాలను మిగిల్చింది. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడికి వేరే హీరోలు ఛాన్సులు ఇవ్వడం లేదని టాక్. దాంతో మళ్ళీ గోపీచంద్ హీరోగా సినిమా చేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీని తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది