Kamal Haasan : సిమ్రాన్ ను వాడుకుని వ‌దిలేసిన కమల్‌హాసన్.. ఆ హీరోయినే కార‌ణ‌మా..?

Authored By mallesh | The Telugu News | Published on: August 21, 2022, 4:20 pm

Kamal Haasan : విశ్వనటుడు కమల్‌హాసన్ ఒక అద్బుతమైన యాక్టర్ గానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.సినిమాల్లోకి రాకముందు కల్చరల్ డ్యాన్స్ నేర్చుకున్న కమల్.. సినిమాల్లో రాణించేందుకు చాలా కష్టపడ్డారని టాక్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. కమల్‌కు నటనా పరంగా విచిత్ర సోదరులు,స్వాతిముత్యం, భారతీయుడు, దశావతారం వంటి సినిమాలు ఎంతో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఆ మధ్యంలో కమల్ సొంతంగా విశ్వరూపం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీనికి ఆయననే నిర్మాత, దర్శకుడు, యాక్టర్‌గా వ్యవహరించారు.

Kamal Haasan : కమల్, సిమ్రాన్ ఎలా విడిపోయారంటే..

ఇక కమల్ తన సినీ కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపించారు. అందులో పొడుగు కాళ్ల సుందరి సిమ్రాన్ కూడా ఒకరు.ముంబైలో మోడలింగ్ చేసిన సిమ్రాన్ ఆ తర్వాత అక్కడే పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వచ్చి పలు సినిమాలు చేసింది. అక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా సిమ్రాన్ పలు సినిమాలు చేసింది. ఇక తెలుగులో అయితే చిరు, బాలయ్యబాబు, నాగ్, వెంకటేశ్ వంటి అగ్రతారలతో కలిసి నటించింది. సిమ్రాన్ తమిళ సినిమాలు చేసే సమయంలో కమల్ హాసన్‌తో పరిచయం ఏర్పడింది.ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కూడా వార్తలు వచ్చాయి.అంతేకాకుండా వీరు బయట ఫంక్షన్లకు, ఈవెంట్లకు తిరిగే సమయంలో పలుమార్లు మీడియా కంటబడ్డారు.

Gouthami in Between Kamal Haasan Affair With Simran

Gouthami in Between Kamal Haasan Affair With Simran

దీంతో నిజంగానే వీరిమధ్య ప్రేమ ఉందని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి మరో స్టార్ హీరోయిన్ కారణం అని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి గౌతమి. గౌతమితో కలిసి సినిమాలు చేసే టైంలో కమల్ హాసన్ రెండోసారి ప్రేమలో పడ్డాడట.అయితే, ఆ విషయం తెలుసుకున్న సిమ్రాన్ కమల్‌కు దూరంగా ఉండి సినీ ఇండస్ట్రీకి కూడా మెల్లిమెల్లిగా దూరమవుతూ వచ్చిందట. ఆ తర్వాత సిమ్రాన్ దీపక్ బుగ్గా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2014లో కమల్ హాసన్ సరసన దృశ్యం సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా సిమ్రాన్ నో చెప్పిందట.. అంతే కాదు నన్ను అవకాశం వచ్చినప్పుడు వాడుకున్నాడని తన సన్నిహితుల దగ్గర చెప్పి సిమ్రాన్ బాధ పడిందని కూడా అప్పట్లో లీకులు వచ్చాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp