Bharateeyudu 2 Movie Review : భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bharateeyudu 2 Movie Review : భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Bharateeyudu 2 Movie Review : భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Bharateeyudu 2 Movie Review  న‌టీ నటులు:కమల్ హాసన్,సిద్దార్థ్,ఎస్ జే సూర్య,బాబీ సింహా,సముద్రఖని,రకుల్ ప్రీత్
దర్శకుడు: శంకర్
సంగీత ద‌ర్శ‌కుడు: అనిరుథ్ ర‌విచంద్ర‌న్
వ్యవధి:2 Hrs 52 Min
రిలీజ్ డేట్: జూలై 12, 2024

క‌థ‌: సినిమా హీరో సిద్ధార్థ్ మీద ఓపెన్ అవుతుంది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి మీద సిద్ధార్థ్ తన టీమ్ తో కలిసి వీడియోలు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. శంకర్ ప్రారంభ సన్నివేశాల్లోనే మెయిన్ పాయింట్ ని టచ్ చేసి నేరుగా క‌థ‌లోకి వెళ్లాడు. స్వతంత్ర సమరయోధుడు అయినా సేనాపతి (కమల్ హాసన్) సమాజంలోని అవినీతిదారుల్ని, లంచగొండుల్ని ఏరిపారేందుకు ఇండియాకి వ‌స్తాడు. అయితే తన కొడుకు చందు (యంగ్ కమల్ హాసన్) చేసిన అవినీతిని ఖండిస్తాడు. ఇండియాకి వ‌చ్చాక నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం పై మళ్లీ ఎలాంటి పోరాటం చేశాడు? నేటి యువతను ఈ పోరాటంలో ఎలా భాగస్వామిని చేశాడు? అసలు సేనాపతి రావడాన్ని నేటి సమాజం ఎలా చూసింది? చివరకు లంచగొండి సమస్యని, అవినీతి మయమైన అధికారులను సేనాపతి ఎలా అంతం చేశాడన్నది కథ.

Bharateeyudu 2 Movie Review  న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి సేనాప‌తిగా విశ్వ‌రూపాన్ని చూపించాడు. రెండు పాత్ర‌ల‌లో అద‌ర‌గొట్టాడు. ఇక సిద్ధార్థ్ కూడా త‌న పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయాడు. రీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ప్రియా భవాని శంకర్ దివంగత నటుడు వివేక్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.వారంద‌రు
కూడా త‌మ పాత్ర‌ల‌లో జీవించారు.

Bharateeyudu 2 Movie Review  టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

ద‌ర్శ‌కుడు శంక‌ర్ మూవీని మొద‌టి పార్ట్ అంత రిచ్‌గా తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. శంకర్ తన పట్టుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఆ స్థాయి మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. తెలుగు సాంగ్స్ బాగా నిరాశపరిచాయి. భారతీయుడు మూవీకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఆ స్థాయి సాంగ్స్, మ్యూజిక్ ఆశించడం అత్యాశే అవుతుంది.

Bharateeyudu 2 Movie Review  ప్ల‌స్ పాయింట్స్ :

క‌మ‌ల్ హాస‌న్, సిద్ధార్థ్, బాబీ సింహా
ఇంట‌ర్వెల్ బ్లాక్
కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్

మైన‌స్ పాయింట్స్:

క‌థ‌, స్క్రీన్ ప్లే
శంక‌ర్ డైరెక్ష‌న్
అనిరుథ్ సంగీతం

చివ‌రిగా: నేటి త‌రానికి భార‌తీయుడు ఎలా చంపుతాడో తెలియ‌జేయ‌డానికి మాత్ర‌మే సీక్వెల్ తీసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. లాంగ్ లెన్త్ డైలాగ్స్, సాగదీతతో కూడిన సన్నివేశాలు నిరాశపరుస్తాయి. సెకండ్ హాఫ్ పర్లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి హైలెట్ . ఇక మూవీ చివ‌ర‌లో భార‌తీయుడు 3 ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శిస్తారు. పార్ట్ 2 ట్రైల‌ర్ చూసిన‌ప్పుడే సినిమాలో ఏమి లేద‌ని అర్ధ‌మైంది.ఇప్పుడు పార్ట్ 3 ట్రైల‌ర్ చూశాక అదే ఫీలింగ్ క‌లుగుతుంది. మొక్కుబ‌డిగా శంక‌ర్ ఈ సినిమాని తెర‌కెక్కించాడ‌ని మాత్రం ఫైన‌ల్‌గా చెప్ప‌వ‌చ్చు.

 

Bharateeyudu 2 Movie Review : లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ kamal haasan న‌టించిన చిత్రాల‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న న‌టించిన విక్ర‌మ్ చిత్రం పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో ఇప్పుడు భారతీయుడు2 చేశాడు. 1996లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాలో సేనాపతిగా.. చంద్రబోస్ గా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. అంతేకాదు లంచగొండి తనాన్ని సహించని భారతీయుడు ..సేనాపతి.. తన కుమారుడిని చంపేసి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్లీ దేశంలో అరాచకం, లంచగొండితనం అనేది ప్రభలుతుంది.దీన్ని అరికట్టడానికి మళ్లీ సేనాపతి విదేశాల నుంచి మన దేశానికి వస్తాడు.

Bharateeyudu 2 Movie Review సినిమాపై పాజిటివ్ టాక్..

ఈ క్రమంలో అవినీతి పరులను ఎలా అంత మొందించాడనేదే ఈ ‘భారతీయుడు 2’ స్టోరీ. ఈ సినిమా దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరిగింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు.. కొంత మంది నటీనటులు.. టెక్నిషియన్స్ చనిపోవడం, కోవిడ్ సినిమాకి అంత‌రాయం క‌లిగించాయి. అయితే వాట‌న్నింటిని త‌ట్టుకొని భార‌తీయుడు 2 మూవీ ఎట్ట‌కేల‌కి విడుద‌ల అవుతుంది. సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేశారు. అయితే ‘ఇండియన్ 2’కు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 180.04 మినిట్స్! అంటే… అక్షరాలా మూడు గంటలు అన్నమాట.

Bharateeyudu 2 Movie Review భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్

Bharateeyudu 2 Movie Review : భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

‘ఇండియన్ 2’ను వారం క్రితమే చూశానని ఉమైర్ సందు తాజాగా త‌న రివ్యూ ఇచ్చాడు.. ”సెన్సార్ బోర్డులో ఇప్పుడే ‘ఇండియన్ 2’ చూశా. మైండ్ బ్లోయింగ్” అని జూలై 3న ట్వీట్ చేశారు. అతడు బుధవారం రాత్రి మళ్ళీ ‘ఇండియన్ 2’ గురించి ట్వీట్ చేశారు. ”ఈ ఏడాది వచ్చిన పవర్ ఫుల్ సినిమా ఇది. వారం క్రితమే చూశా. మజా ఆగాయా” అని ఉమైర్ పేర్కొన్నాడు. సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. సాధారణంగా ప్రతి సిన్మా రిలీజ్ ముందు అతడు నెగెటివ్ రివ్యూలు ఇస్తూ పాపులర్ అయ్యాడు. కానీ, కమల్ ‘ఇండియన్ 2’కు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం విశేషం.

Bharateeyudu 2 Movie Review భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్

Bharateeyudu 2 Movie Review : భార‌తీయుడు 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

భార‌తీయుడు2 సినిమాపై సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మీడియాకు వేసిన ప్రత్యేక షోలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, నెడుముడి వేణు, ఎస్. జె.సూర్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఒక ‘భారతీయుడు’ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. కానీ భారతీయుడు 2కు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో పలు సన్నివేశాల్లో అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులకు చేరువ అయ్యాయి.ఏడేళ్ల క్రితం ‘భారతీయుడు’కు సీక్వెల్ వస్తుందని ప్ర‌చారాలు జ‌రిగాయి. కోవిడ్ కంటే ముందే నిజంగానే ఈ సీక్వెల్ తెరకెక్కిస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ‘భారతీయుడు 2’ షూటింగ్‌లో ఎన్నో సమస్యలు ఎదురు కావ‌డంతో ఫైన‌ల్‌గా జూలై 12న రిలీజ్‌కి సిద్ధ‌మైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది