Guppedantha Manasu 01 August 2022 Episode : రిషి సాక్షి గురించి దేవయానికి వారింగ్.. వసుధర మనసులో మీరే ఉన్నారు సార్ అన్న జగతి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 01 August 2022 Episode : రిషి సాక్షి గురించి దేవయానికి వారింగ్.. వసుధర మనసులో మీరే ఉన్నారు సార్ అన్న జగతి..!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,10:30 am

Guppedantha Manasu 01 August 2022 Episode : సాక్షి వసుధర దగ్గరకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.. వెంటనే వసుధర ఆట ఎప్పుడు ముగుస్తుందో తెలుసా అని వసు అంటుంది.. నా గెలుపు నువ్వు కళ్ళారా చూసినప్పుడు.. మా ప్రేమ గెలిచినప్పుడు.. అంతేకానీ మోసం గెలిచినప్పుడు కాదు.. ఏంటి నీకు ఇంకా నమ్మకం కలగలేదా అని వసు సాక్షి అడుగుతుంది.. నమ్మకం కాదు సాక్షి.. నువ్వు రిషినీ గెలవగలను అని ఎలా అనుకుంటున్నావు.. ఇప్పుడు రిషి సార్ సైలెంట్ గా ఉన్నారని.. నువ్వు గెలిచావని ఎలా అనుకుంటున్నావు.. నువ్వు రిషి సార్ ని ఎప్పటికీ గెలవలేవు.. గెలిచేది ఏంటో నాకు తెలుసు అని వసుధర అంటుంది.. నువ్వు అప్పుడే గెలిచాను అని విర్రవీగకు.. ముందుది అసలు ఆట అని వసు ఇందిరెక్ట్ గా చెబుతుంది.. సాక్షి నువ్వు ఒక పెద్ద అచీవ్మెంట్ చేశావని దేవయని తనని పొగుడుతుంది..

జగతికి, వసుధారా కి ఊహించని షాక్ ఇచ్చావు.. రిషిని మాట్లాడకుండా తనను ఒప్పించావు కానీ.. ఈ విజయంతో నువ్వు రిలాక్స్ అవ్వద్దు సాక్షి.. ఎదుటివారు ఏం చేస్తారో చూసి దాన్నిబట్టి మనం మన ఎత్తుగడలను మార్చుకోవాలి.. ఆంటీ ఇప్పుడు రిషి మన దారికి వచ్చినట్టేనా అని సాక్షి అడుగుతుంది. రిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో కూడా మనకు తెలియదు.. రిషి ని కేవలం ప్రేమతో మాత్రమే లొంగదీసుకోగలం అని సాక్షికి చెబుతుంది..రిషి క్యాంటీన్ కి వెళ్తాడు. అక్కడ వసు, మహీంద్రా, జగతి, గౌతమ్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. రిషి దగ్గరకు వెళ్లి గౌతమ్ అసలు ఏం జరుగుతుందో అని అడగాలి అనుకుంటాడు.. ఇది క్యాంటీన్ ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చానని.. ఇక్కడ డిస్కషన్ చెయ్యద్దు అని అంటాడు రిషి.. వసుదర అక్కడి నుంచి అమ్మవారి దగ్గరకి వెళ్లి రిషి సారే నా జీవితం..

Guppedantha Manasu 01 August 2022 Full Episode

Guppedantha Manasu 01 August 2022 Full Episode

ఆయన బాగుండాలి.. సాక్షి నుంచి తనకు వచ్చే ముప్పు నుంచి మమ్మల్ని నువ్వే బయట పడేయాలి అని వేడుకుంటుంది వసు.. నా మనసులో ఏం ఉందో నీకు తెలుసు తల్లి.. నువ్వు అన్ని చూస్తూనే ఉంటావు.. ఈ సమస్య నుంచి రిషి సార్ ను ఎలాగైనా నువ్వే బయట పడేయాలి తల్లి అనుకుంటుంది.. జగతి రిషి సార్ నేను.. ఇప్పుడు ఏం మాట్లాడకండి..అయినా మాట్లాడటానికి ఏం ఉంది.. కొన్ని సార్లు మన మౌనం కూడా మనకు ప్రమాదమే.. ఎవరు చెప్పేది వాళ్లు చెబుతారు.. మేడం వసు గురించి ఏం చెప్పకండి.. సాక్షి గురించి అస్సలు మాట్లాడకండి.. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి..

జీవితం లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.. వాటిని ఒక్కొకటి దాటుకుంటూ వెళ్లాలి.. వసుధర గురించి మీరు మాట్లాడద్దు అని అన్నారు.. కానీ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ అని జగతి చెబుతుంది.. రేపటి ఎపిసోడ్లో వసుధార రిషికి కాల్ చేస్తుంది హలో ఏంటి ఇంకా నిద్రపోలేదు అని రుషి అడుగుతాడు కళ్ళు మూసుకుంటే నిద్రపోతాను కానీ.. నేను కళ్ళు మూసుకుంటే నా మనసు తెలుసుకుంటుంది సార్.. సాక్షి సాక్షి సాక్షి ఎవరు పెద్దమ్మ ఈ సాక్షి.. తనకు మనకు ఏంటి సంబంధం.. ఇప్పటిదాకా తను చేసింది తప్పు ఇంకా ఇలాగ చేస్తూ ఉంటే నేనేంటో నావే నా ఆవేశం ఏంటో చూపించాల్సి వస్తుంది అని రిషి అంటాడు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది