Guppedantha Manasu Serial : గుప్పెడంత మనసు ఫేమ్ వసుధార తన అందచందాలతో గత్తర లేపుతుందిగా..!
ప్రధానాంశాలు:
Guppedantha Manasu Serial : గుప్పెడంత మనసు ఫేమ్ వసుధార తన అందచందాలతో గత్తర లేపుతుందిగా..!
Guppedantha Manasu Serial : సినిమాలకే కాదు సీరియల్స్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతుంది Guppedantha Manasu Serial గుప్పెడంత మనసు సీరియల్. హీరోలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. రిషి సార్ కు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రిషికే కాదు వసుధారకు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. వసుధార మంచి నటనతో, ఈ సీరియల్లో తన అందం అభినయంతో, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. 2020 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ 2024 ఆగష్టు వరకు టెలికాస్ట్ అయ్యింది.. ఈ సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ లేదు.. స్టూడెంట్, లెక్చరర్, చదువు మధ్య వచ్చిన సీరియల్ ఒకానొక సమయంలో సూపర్ హిట్టు..
Guppedantha Manasu Serial బాబోయ్.. ఏంటి ఈ రచ్చ..
రక్షా గౌడ్ గుప్పెడంత మనసులో వసుధార పాత్రలో నటించగా ఆమె పాత్రకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు.. ఎక్కడ ఎలా ఉండాలో ఆమెకు తెలుసు అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది..కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట పలు సీరియల్స్ తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యిందో అప్పటినుంచి ఈ చ్ఛిన్నాడని రేంజ్ మారిపోయిందని చెప్పాలి. వసుగా అమ్మడు.. అల్లరి, సీరియస్ నెస్, రిషితో గొడవలు.. ఆమె క్యారెక్టర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక పేరుకు తగ్గట్టే రక్ష రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుందంట. ఒకప్పుడు టీవీ ఆర్టిస్ట్‌లంటే ఒకింత చిన్నచూపు ఉండేది.. కానీ, ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో సినిమా వాళ్లకి గట్టి పోటీగానే నిలబడుతున్నారు ఈ బుల్లితెర బ్యూటీలు.
సీరియల్ పూర్తి అయిన తర్వాత ముఖేష్ గౌడ, రక్ష గౌడ ఏం చేస్తున్నారు అని అందరు ఆరాలు తీస్తున్నారు. ముఖేష్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు. మరీ రక్షా ఏం చేస్తుంది ? అంటూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం వసుధార ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూఇయర్ వేడుకల కోసం ఆమె ఈ వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో రక్షా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.ఇన్నాళ్లు సీరియల్లో చుడిదార్స్, చీరకట్టులో ఎంతో ముద్దుగా, పద్దతిగా కనిపించిన రక్షా.. ఇప్పుడు ఫారెన్ వెకేషన్ లో మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. రక్షా న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. వసుధార ఇది నువ్వేనా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.